డిజిటల్ ప్రపంచం వేళ్లూనుకుంటున్న ఈ దశలో సినిమా నిలబడటానికి ఆపసోపాలు పడుతోంది. దీనికి తోడు సీజన్ కూడా కలిసి రావడం లేదు. ఇదిలా వుంటే చైనా నుంచి పాకిన కరోనా వైరస్ జనాలు పబ్లిక్ ప్లేసుల్లోకి, మాల్స్‌లోకి రావాలంటే భయంతో భీతిల్లిపోతున్నారు. దీని కారణంగా జనాలు థీయేటర్లని కూడా అవైడ్ చేయడం సినీ వర్గాలని భయాందోళనకు గురిచేస్తోంది.
ఈ శుక్రవారం నాలుగు చిన్న చిత్నాలు విడుదలయ్యాయి. ఒకటి రెండు తప్ప ఏదీ అంతగా లేదు. అందులో `పలాస 1978` చిత్రం కూడా వుంది. ఈ మూవీ కొంత పనవాలేదు. అయితే థియేటర్ ఆక్యెపెన్సీ మాత్రం 20 శాతానికి మించి ఫుల్ కావడం లేదు. ఇన్ని వ్యవ ప్రయాసలకోర్చి సినిమాతీస్తే చూడరా? దళితుల కోసం తీస్తే వాళ్లే సినిమాకు సపోర్ట్ చేయకపోతే ఎలా?. మంచి సినిమా తీస్తే చూడరా అంటూ తమ్మారెడ్డి భరద్వాజ మీడియా ముఖంగా ప్రేక్షకులని తిట్టడం చర్చనీయాంశంగా మారింది.
అయితే ఇన్ సైడ్ టాక్ మాత్రం వేరేలా వుంది. ఈ సినిమాకు ముగ్గురు పీఆర్వోలు పనిచేశారు. ఆ ముగ్గురు `ఆ నలుగురు` మీడియా సంస్థల్ని మాత్రమే పట్టించుకుని మిగతా వారిని అసలు మనుషుల్లా కూడా చూడలేదు. ఆ నాలుగు పత్రికల్లో మాత్రమే పబ్లిసిటీ అయితే కింది స్థాయి ప్రేక్షకుడి వరకు సినిమా ఎలా వెళుతుంది?.. తిట్టాల్సింది. థియేటర్‌కు రాని ప్రేక్షకుడిని కాదు తమ సినిమాకు పబ్లిసిటీ చేయకుండా డబ్బులు దండిగా పక్కనేసుకున్న ముగ్గురు పీఆర్వోలని. ఇది గమనించకుండా మా సినిమా చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని తిట్టేస్తే ఎట్టా భరద్వాజ గారూ అంటూ ఇండస్ట్రీలో, మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి.