తార‌క్ టాస్క్ కంప్లీట్‌.. ఆ న‌లుగురికి ఛాలెంజ్ విసిరాడు

తార‌క్ టాస్క్ కంప్లీట్‌.. ఆ న‌లుగురికి ఛాలెంజ్ విసిరాడు

లాక్ డౌన్ స‌మ‌యంలో సినిమా సెల‌బ్రిటీస్ ఖాలీగా వుండ‌టం లేదు. ఆస‌క్తిక‌రమైన వీడియోల‌తో నిత్యం ఆక‌ట్టుకుంటున్నారు. తాజాగా ఆదివారం ఇంటి ప‌నిలో శ్రీ‌మ‌తుల‌కు సాయం చేసి నిజ‌మైన మ‌గాళ్లు అనిపించుకోండ‌ని `అర్జున్‌రెడ్డి` ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగా ఓ వీడియోని పోస్ట్ చేసి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి ఛాలెంజ్ విసిరిన విష‌యం తెలిసిందే.

సోమ‌వారం సందీప్ వంగా ఛాలెంజ్‌ని స్వీక‌రించిన రాజ‌మౌళి త‌న స‌తీమ‌ణి ర‌మా రాజ‌మౌళికి ఇంటి ప‌నిలో సాహం చేసి ఆ వీడియోని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, కీర‌వాణి, శోభు యార్ల‌గ‌డ్డ‌, సుకుమార్‌ల‌కు ఛాలెంజ్ విసిరారు. ఈ వ‌రుస‌లో జ‌క్క‌న్న ఛాలెంజ్‌ని స్వీక‌రిస్తున్నానంటూ ప్ర‌క‌టించిన ఎన్టీఆర్ మంగ‌ళ‌వారం ఓ వీడియోని పోస్ట్ చేశారు.

`మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం.. ప‌నిని షేర్ చేసుకోవ‌డంలో ఆనందం వుంది. అని చీపురు ప‌ట్టిన ఎన్టీఆర్ గార్డెన్ క్లీన్ చేయ‌డ‌మే కాకుండా ఇంట్లో ఫ్లోర్ క్లీన్ చేశారు. ఆ త‌రువాత పాత్ర‌ల‌న్నింటినీ క‌డిగి క్లీన్ మోకాళ్ల‌పై కూర్చుని శుభ్రంగా తుడిచి బీ ద రియ‌ల్ మెన్ అనిపించుకున్నారు. ప‌నిలో ప‌నిగా ఈ ఛాలెంజ్ కి బాబాయ్ బాల‌కృష్ణ‌ని, చిరంజీవిని, నాగార్జున‌, వెంక‌టేష్‌, కొర‌టాల శివ‌ల‌ను నామినేట్ చేస్తున్న‌ట్టు ట్వీట్ చేయడం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ లిస్ట్‌లో బుధ‌వారం వీడియో పోస్ట్ చేసేది ఎవ‌రో చూడాలి.