ట్రైల‌ర్ టాక్‌: ట‌బుతో కుర్ర‌హీరో శృంగారం పీక్స్

వేడెక్కించే `ఏ సూటబుల్ బాయ్`

ఇషాన్ ఖత్త‌ర్ – టబు ప్ర‌ధాన‌పాత్ర‌లు పోషించిన తాజా చిత్రం `ఏ సూటబుల్ బాయ్`. మీరా నాయర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బీబీసీ వ‌న్స్ టీవీ అడాప్టేష‌న్ మూవీ ఇది. తాజాగా నిమిషం నిడివితో ఉన్న‌ ట్రైల‌ర్ విడుదలైంది. `ఏ సూటబుల్ బాయ్` పోస్ట‌ర్ల‌తోనే వేడెక్కించిన కాన్సెప్ట్. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే ఓ విశ్వవిద్యాలయ విద్యార్థి లత 1951 లో ఉత్తర భారతదేశంలో జ‌రిగిన క‌థ‌ను చెబుతుంటుంది. దేశం మొదటి సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న త‌రుణమ‌ది. స్వాతంత్య్రం తరువాత సొంత గుర్తింపును దేశంలో ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ను రూపుదిద్దుతున్న కాల‌మ‌ది. నాటి సామాజిక స్థితిగ‌తుల్ని సంస్కృతిని బ‌హిర్గ‌తం చేసే చిత్ర‌మిది.

తాజాగా రిలీజ్ చేసిన నిమిషం నిడివి ఉన్న ట్రైలర్‌లో ఇషాన్ – టబు మ‌ధ్య‌ అనేక శృంగార సన్నివేశాలు ఉన్నాయి. ఇషాన్ త‌న‌కంటే ఎంతో పెద్ద వ‌య‌సు ఉన్న ట‌బుతో శృంగారం చేయ‌డం.. అది భ‌రించ‌లేనిది అంటూ అత‌డి తండ్రి సీరియ‌స్ అవ్వ‌డం.. నాటి వ్య‌వ‌స్థ అంగీక‌రించ‌లేద‌ని అన‌డం ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తోంది. విక్రమ్ సేథ్ రాసిన నవల ఆధారంగా ఈ సిరీస్ రూపొందిస్తున్నారు. ఇషాన్, టబు స‌హా రామ్ కపూర్, తాన్య మణిక్తాలా రసిక దుగల్ తదితరులు నటించారు.

ట‌బుతో అలాంటి రొమాంటిక్ అనుభ‌వం అంటే చాలా భ‌య‌ప‌డ్డాను అని ఇంత‌కుముందు ఓ ఇంట‌ర్వ్యూలో ఇషాన్ కాస్త సిగ్గుప‌డుతూనే చెప్పినా.. అలాంటి గొప్ప అనుభ‌వాన్ని ఎప్ప‌టికీ మ‌రువ‌లేన‌ని కొస‌రాడు. ‘భయంకరమైన అనుభవం’ అంటూనే ఇషాన్ చాలా సంగ‌తులే చెప్పాడు. “నేను ఎదగడానికి అవకాశం క‌ల్పించే అనుభవాలను కోరుకుంటాను. నా అభిమాన నటీమణితో న‌టుడిగా అలాంటి గొప్ప‌ అనుభవం వేరొక‌టి ఉండ‌దు. అది ఎంతో ఉద్వేగాన్ని క‌లిగించింది“ అని అన్నాడు.

దాదాపు 14 సంవత్సరాల తరువాత మీరా నాయ‌ర్ తో క‌లిసి మ‌రో చిత్రం కోసం ప‌ని చేసిన టబు అంతే ఎగ్జ‌యిట్ అయ్యారు. 2006 `ది నేమ్‌సేక్` కోసం కలిసి పనిచేశారు. “ది నేమ్‌సేక్ సమయంలో మీరాలో నేను చూసిన అదే శక్తి ఇప్ప‌టికీ త‌న‌కు ఉంది. ఆమెకు వయసు పెరిగిందని నేను అనుకోను. మీరా ఇంతకుముందు పనిచేసిన వ్యక్తులతో కలిసి పనిచేస్తోంది. నేటి ప్రపంచంలో ఇటువంటి బంధాలను క‌లిగి ఉండ‌డం అరుదైన గుణం. ఆమె రాక్ సాలిడ్ నైజాం అలాంటిది. మీరాతో మళ్లీ కనెక్ట్ అవ్వడం చాలా అద్భుతంగా ఉంది. ఆమెతో క‌లిసి ప‌ని చేయ‌డం ఎంతో గొప్ప‌గా ఉంటుంది. ఆమె ఏదో మాయాజాలం సృష్టిస్తుంది“ అని ట‌బు ఎమోష‌న్ అయ్యారు.

A Suitable Boy Trailer - BBC