టిల్ లుక్: `పుష్ప` మాసీ ర‌గ్గ్ డ్

టిల్ లుక్: `పుష్ప` మాసీ ర‌గ్గ్ డ్

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేష‌న్ లో హ్యాట్రిక్ మూవీ రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా ఇప్ప‌టికే వాయిదా ప‌డింది. తాజాగా టైటిల్ లుక్ ని సుక్కూ – మైత్రి మూవీ మేక‌ర్స్ బృందం రిలీజ్ చేసింది. పుష్ప అనే సింపుల్ టైటిల్ ని ఎంపిక చేయ‌డం బ‌న్ని ఫ్యాన్స్ కి స‌ర్ ప్రైజ్ ఇచ్చింది. తాజా పోస్ట‌ర్ లో బ‌న్ని లుక్ ర‌ఫ్ అండ్ ట‌ఫ్ గా ర‌గ్గ్ డ్ గా క‌నిపిస్తోంది. కాస్త డీగ్లామ‌రైజ్డ్ లుక్ తో క‌నిపిస్తున్నాడు. రంగ‌స్థ‌లంలో చ‌ర‌ణ్ ని చిట్టిబాబుగా చూపించిన సుక్కూ ఈసారి బ‌న్నీని అంతే మాసీగా చూపిస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది.

ఇది గంధ‌పుచ‌క్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఉత్కంఠ రేపే చిత్ర‌మిద‌ని చెబుతున్నారు. ఇందులో బ‌న్ని ఒక లారీ డ్రైవ‌ర్ గా క‌నిపించ‌నున్నాడు. సినిమా మెజారిటీ భాగం శేషాచ‌లం అడ‌వుల్లో తెర‌కెక్కాల్సి ఉండ‌గా.. అనుమ‌తులు లేని కార‌ణంగా వేరే చోట తెర‌కెక్కించేందుకు సుక్కూ బృందం స‌న్నాహాలు చేస్తోంది. ఇందులో బ‌న్ని తిరుప‌తి యాస‌ను మాట్లాడ‌తార‌ని.. అందుకు సంబంధించి శిక్ష‌ణ తీసుకున్నాడ‌ని ఇప్ప‌టికే క‌థ‌నాలొచ్చాయి. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న క‌థానాయిక‌గా న‌టిస్తోంది. దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. న‌వీన్ ఎర్నేని- ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని ముత్తం శెట్టి మీడియా సంయుక్త నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నారు.