టాప్ లెస్‌గా పోజులిచ్చిన కియారా!

నెట్‌ఫ్లిక్స్ కోసం అనురాగ్ క‌శ్య‌ప్ రూపొందించిన వెబ్ సిరీస్ `ల‌స్ట్ స్టోరీస్‌`. ఇందులో ఓ భాగాన్ని క‌ర‌ణ్ జోహార్ రూపొందించాడు. మేఘాగా న‌టించిన కియారా అద్వానీ న న‌ట‌న‌తో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ వెబ్ సిరీస్‌లో కియారా హ‌ద్దులు దాటి అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసి విమ‌ర్శ‌కుల‌నే ఔరా అనిపించింది. హీరోయిన్‌గా తిరుగులేని క్రేజ్‌ని సొంతం చేసుకుని వ‌రుస ఆఫ‌ర్ల‌ని సొంతం చేసుకుంది. తెలుగులో `భ‌ర‌త్ అనే నేను` , విన‌య విధేయ రామ‌` చిత్రాల్లో న‌టించింది.

తాజాగా మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచి సినీ వ‌ర్గాల‌కే త‌న డేర్‌నెస్‌తో విస్మ‌యాన్ని క‌లిగిస్తోంది. ప్ర‌తీ సంవ‌త్స‌రం బాలీవుడ్ పాపుల‌ర్ ఫొటోగ్రాఫ‌ర్ డ‌బూ ర‌త్నాని బాలీవుడ్ స్టార్‌ల‌తో న్యూ ఇయ‌ర్ క్యాలెండ‌ర్ కోసం ప్ర‌త్యేకంగా ఫొటో షూట్‌లు నిర్వ‌హిస్తుంటారు. దీని కోసం తార‌లు పోటీప‌డి ఫొటోల‌కు పోజులిస్తుంటారు. ఈ ఏడాది డ‌బూ ర‌త్నాని క్యాలెండ‌ర్ కోసం నిర్వ‌హించిన ఫొటో షూట్ కోసం కియారా న‌గ్నంగా ఫొటోల‌కు పోజులివ్వ‌డం హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన ఓ ఫొటోని కియారా మంగ‌ళ‌వారం సోష‌ల్ మీడియా ట్వీట్ట‌ర్ వేదికగా అభిమానుల‌తో పంచుకుంది. ఆకుని అడ్డుగా పెట్టుకుని న‌గ్నంగా కియారా ఇచ్చిన పోజు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.