మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. చిరు 152వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఎండోమెంట్ అధికారిగా, ప్రజానాట్యమండలి కార్యకర్తగా చిరు నటిస్తున్న ఈ సినిమా నిత్యం వార్తల్లో నిలుస్తూ హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా కోసం రేర్ కాంబినేషన్‌ని సెట్ చేస్తున్నారని, ఓ కీలక పాత్రలో మహేష్ నటిస్తున్నారని, ఆయన పాత్ర రాడికల్ స్టూడెంట్ లీడర్‌గా వుంటుందని, సినిమాకు అత్యంత కీలకమని, ఇందు కోసం 30 డేస్ కేటాయించారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
అయితే ముందు ఈ పాత్రని రామ్‌చరణ్ కోసమే కొరటాల శివ రాశారట. రామ్‌చరణ్ `ఆర్ ఆర్ ఆర్` షూటింగ్‌లో బిజీగా వుండటం వల్ల ఆ పాత్రని మహేష్‌తో చేయించాలని ప్లాన్ చేశారు. కానీ కొరటాల మాత్రం రామ్‌చరణ్ అయితేనే బాగుంటుందని పట్టుబడుతున్నారట. ఈ విషయమై రాజమౌళిని అడిగితే కొన్ని షరతులతో ఓకే చెప్పినట్టు తాజా న్యూస్. అంటే మహేష్ ఆ పాత్రని చేయడం లేదన్నమాట చివరికి రామ్‌చరణే చేయబోతున్నాడని తెలుస్తోంది.