చిరు మాట‌కి చేత‌కి సంబంధం లేదే?

`స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రాన్ని యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తి చేశార‌ని, ఇంత‌కన్నా ఇండ‌స్ట్రీకి కావాల్సింది ఏముంది. అంద‌రూ ఇలాగే ఫ‌స్ట్‌గా సినిమాలు పూర్తిచేయాలి. అలాంటప్పుడే ప‌రిశ్ర‌మ ప‌ది కాలాల పాటు చ‌ల్ల‌గా వుంటుంది. మ‌హేష్ ఈ సినిమాకు ముందు డ‌బ్బులు తీసుకోలేద‌ని తెలిసింది. ఇలా ప్ర‌తి హీరో చేయాలి. ఖ‌ర్చుని త‌గ్గించుకోవాలి` `స‌రిలేరు నీకెవ్వ‌రు` ప్రీరిలీజ్ ఈ వెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి అన్న మాట‌లివి. అయితే ఆయ‌న మాట‌ల‌కు చేత‌ల‌కి ఎక్క‌డా సంబంధం క‌నిపించ‌డం లేదు.

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. మ్యాట‌నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్‌రెడ్డితో క‌లిసి రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ ఫుల్ స్వింగ్‌లో వుంది. ఇటీవ‌లే పాట‌తో షూటింగ్ మొద‌లుపెట్టారు. అయితే కార్ వాన్ల కోసం ప్రొడ‌క్ష‌న్ టీమ్ ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోందట‌. చిరుతో పాటు డైరెక్ట‌ర్‌కి, కెమెరామెన్ ర‌త్న‌వేలు, ఆయ‌న టీమ్‌కి మ‌రొక‌టి ఇలా లెక్క‌కు మించి కార్ వాన్‌లు ఫిక్స్ చేశారు. అయినా చిరు కూతురు స్మిత‌కీ ఓ కార్ వాన్ కావాల‌న్నార‌ట‌.

ఇదీ కాక హీరో రామ్‌చ‌ర‌ణ్ కూడా సెట్‌లో మ‌రో కార్ వాన్ ని తెచ్చేసుకోవ‌డంతో ఎందులో ఎవ‌రున్నారో తెలియ‌క కొర‌టాల టీమ్ జుట్టు పీక్కుంటున్నార‌ట‌. కార్ వాన్‌ల మోత‌తో బ‌డ్జెట్ మ‌రింత పెరిగే అవ‌కాశం వుంద‌ని చిరు చెప్పిందేమిటి.. చేస్తున్న దేమిట‌ని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.