చిరు ఆటోబ‌యోగ్ర‌ఫీ రాస్తున్నారు!

మెగాస్టార్ నే కాద‌న్నంత మ‌గాడా?

క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌జీవితం స్థంభించిపోయింది. దేశాల‌న్నీ అనూహ్యంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో సామాన్యుల నుంచి సెల‌డ్రిటీలంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మైపోయారు. అయినా ఖాలీగా కూర్చోవ‌డం లేదు. ఎవ‌రికి తోచిన ప‌ని వారు చేస్తున్నారు. కొంత మంది వంట‌ల్లో నైపుణ్యం ప్ర‌ద‌ర్శిస్తుంటే కొంత మంది పెయింటింగ్‌లో ప్ర‌తిభ‌ని చూపిస్తున్నారు.

ఇక స్టార్ హీరోలు కూడా ఈ క్వారెంటైన్ టైమ్‌ని బాగానే యుటిలైజ్ చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఏమాత్రం ఖాలీగా కూర్చోవ‌డం లేదు. క‌రోనా క్రైసిస్ కార‌ణంగా ఉపాది లేకుండా పోయిన సినీ కార్మికుల కొసం క‌రోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)ని మొద‌లుపెట్టి కార్మికుల కోసం 6 కోట్ల‌కు మించి విరాళాలు సేక‌రించారు. ఆ డ‌బ్బులో కొంత ఖ‌ర్చు చేసి సినీ కార్మికుల‌కు నిత్యావ‌స‌ర స‌రుకుల్ని అందించేందుకు సిద్ధం చేస్తున్నారు. దీనికి త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, ఎన్‌.శంక‌ర్ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదే కాకుండా ఇటీవ‌లే సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌లోకి ప్ర‌వేశించిన చిరు నిత్యం యాక్టివ్‌గా వుంటున్నారు. ఇటీవ‌ల ఓ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఈ క్వారెంటైన్ టైమ్‌లో త‌న ఆటో బ‌యోగ్ర‌ఫీని రాస్తున్న‌ట్టు వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. `చాలా కాలంగా నా ఆటోబ‌యోగ్ర‌ఫీని రాయాల‌ని అనుకుంటున్నాను. కానీ అది ఇప్పటికి టైమ్ కుదిరింది. నే చెబుతున్న పాయింట్స్‌ని నా భార్య సురేఖ రికార్డ్ చేస్తోంది. ఆ త‌రువాత ఆ పాయింట్‌ని పేప‌ర్‌పై పెడుతున్నాను` అని చిరు వెల్ల‌డించారు.