చిరంజీవి నిర్మాత తొలిసారి భ‌య‌ప‌డుతున్నారా?

చిరంజీవి నిర్మాత తొలిసారి భ‌య‌ప‌డుతున్నారా?

నిరంజ‌న్‌రెడ్డి.. కొర‌టాల‌కు ఆప్త‌మిత్రుడు.. అయితే ప్ర‌స్తుతం భ‌య‌ప‌డుతున్నారు. కార‌ణంగా తొలి సినిమాకే భారీ స్థాయిలో ఖ‌ర్చు పెట్టాడ‌ట‌. నిరంజ‌న్‌రెడ్డి ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న `ఆచార్య‌` చిత్రం ద్వారా నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. రామ్‌చ‌ర‌ణ్ వ‌న్ ఆఫ్ ద ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన షూటింగ్‌తో 40 శాతం షూటింగ్ పూర్త‌యింది.

ఈ సినిమా ఎప్పుడు మొద‌లైందో అప్ప‌టి నుంచి ఏదో ఓ వివాదం చుట్టుకుంటూనే వుంది. కార‌వాన్‌ల కార‌ణంగా వార్త‌ల్లో నిలిచిన ఈ చిత్రం ఆ త‌రువాత కెమెరామెన్ మార‌డం.. ఆ త‌రువాత ఎడిట‌ర్ మార‌డం… ఇటీవ‌ల ఈ చిత్రం నుంచి త్రిష త‌ప్పుకోవ‌డం వంటి కార‌ణాల‌తో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. తాజాగా మ‌రోసారి ఈ సినిమా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ సినిమాతో తొలిసారి నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్న నిరంజ‌న్ రెడ్డి `ఆచార్య‌` విష‌యంలో భ‌య‌ప‌డుతున్నార‌ట‌. ఇప్ప‌టికే రెమ్యున‌రేష‌న్‌లు, షూటింగ్ ప‌రంగా భారీగా ఖ‌ర్చు చేసిన ఆయ‌న ఇప్ప‌టికీ సినిమా పూర్తి కాక‌పోవ‌డం, పైగా క‌రోనా క్రైసిస్ కార‌ణంగా సినిమా ముందు అనుకున్న ఆగ‌స్టు 14న రిలీజ్ అయ్యే ప‌రిస్థితులు క‌నిపించ‌క‌పోవ‌డంతో తొలి సినిమానే ఈ స్థాయిలో లేట‌యితే న‌ష్టాలు చూడాల్సి వ‌స్తుందేమోన‌ని భ‌య‌ప‌డుతున్నాడ‌ట‌. క‌ర‌టాల కూడా స్నేహితుడిని అన‌వ‌రంగా బుక్ చేశానేమో అని ఫీల‌వుతున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.