హీరోలు సాధారణంగా పెద్ద పెద్ద సంస్థలకే బోలెడంత డబ్బు తీసుకుని ప్రచారం చేస్తుంటారు. అది వారికో ఆదాయ మార్గం. అయితే హీరో మహేష్ బాబు కూడా ప్రచారం చేస్తున్నాడు కానీ ఎదో వస్తువుకు పెద్ద సంస్థకో కాదు వైద్యానికి. అవును మీరు విన్నది నిజమే.
చక్రసిద్ధి నాడీ వైద్యం అనేది మన దేశంలో అంతరించిపోతున్న ఒకానొక వైద్య విధానం. అయితే డబ్బు తీసుకుని ప్రచారం చేయడం వేరు, ఆ సంస్థ ద్వారా సహాయం పొందితే ఆ కృతజ్ఞతతో ప్రచారం చేస్తుంటారు కొందరు. మహేష్ బాబు ఈ రెండో కోవకు చెందుతాడు. మరి ఇంతకీ ఈయన పొందిన మేలేమిటో తెలుసుకుందామా?
హీరో మహేష్ బాబుకి కొన్ని సంవత్సరాలుగా మైగ్రేన్ తలనొప్పి ఉందట. చిత్రీకరణ జరిగేటప్పుడు ఆ శబ్దాల వల్ల, తీవ్ర కాంతి వల్ల అది మరింత పెరిగేదట. దాంతో పెయిన్ కిల్లర్లు తప్ప మరో దారి లేదన్నారట వైద్యులు.
ఇలాంటి సమయంలో మహేష్ భార్య నమ్రత వైద్యురాలు సత్య సింధూజను కలిసింది. తద్వారా కేవలం నాలుగే నెలల్లో మైగ్రేన్ నుంచి ఎలాంటి మందులు లేకుండా ఉపశమనం పొందాడట మన హీరో. ఈ మేరకు ఆయన యూట్యూబ్ లో వీడియో ను కూడా విడుదల చేశారు.