గ‌న్‌తో కాల్చుకొని చ‌నిపోదామ‌నుకున్నా: ప‌వ‌న్‌

చిరు పుట్టిన రోజు వేడుకలో ప‌వ‌న్‌ స్పీచ్

మా అన్నయ్య నాకు స్పూర్తి ప్రధాత. ఎందుకంటే… ఇంట‌ర్మీడియెట్ ఫెయిల్ అయిన త‌ర్వాత నాలో నిరాశ‌, నిస్పృహ పెరిగాయి. అప్పుడు అన్నయ్య వ‌ద్ద ఉన్న లైసెన్స్‌డ్ గ‌న్‌తో కాల్చుకొని చ‌నిపోదామ‌నుకున్నా. కాని ఆ రోజు అన్నయ్య చెప్పిన మాట‌లు నాలో చాలా ధైర్యాన్ని పెంచాయి. ఆ మధ్య తెలంగాణలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులు పదుల సంఖ్యలో చనిపోయినప్పుడు చాలా బాధ కలిగింది. వారికి అన్నయ్య లాంటి వారు ధైర్యం చెప్పి ఉంటే ఇలా జ‌రిగేది కాదేమో అని ప‌వ‌న్ అన్నారు.

Power Star Pawan Kalyan Speech | Megastar Chiranjeevi Birthday Celebrations 2019

పవన్ 

హైదరాబాద్ శిల్ప క‌ళావేదిక‌లో జ‌రిగిన చిరు 64వ బర్త్‌డే వేడుక‌లకి ముఖ్య అతిధిగా పవన్ హాజ‌ర‌య్యారు. ఈ కార్యక్రమంలో ప‌వ‌న్ త‌న అన్న త‌న‌కి స్పూర్తి ప్రదాత అని, ఆయ‌న లేక‌పోతే తాను లేన‌ని చెప్పుకొచ్చాడు. ఓ మ‌హ‌నీయుడు జీవిత చ‌రిత్రని త‌న అన్న‌య్య చేయ‌డం చాలా ఆనంద‌గా ఉంద‌ని కూడా ప‌వ‌న్ పేర్కొన్నాడు.

అలాగే ..టీనేజ్‌లో ఉన్నప్పుడు భారతదేశాన్ని ఎవరైనా ఏదైనా అంటే కోపంతో ఊగిపోయేవాణ్ణి. నా కోపాన్ని చూసిన అన్నయ్య వీడు ఉద్యమకారుడు అయిపోతాడేమో అనుకుని, ‘కులం, మతం అనేవాటిని దాటి మానవత్వం అనేది ఒకటుంటుంది. దాన్ని నీ ఉద్యమంలో, ఆలోచనలో మరచిపోకు’ అన్నారు. హద్దులు దాటకుండా నన్ను ఆపేసిన మాట అది.

22 ఏళ్ళ వ‌యస్సు ఉన్న‌ప్పుడు తిరుపతిలో నిర్మాత తిరుపతి ప్రసాద్‌గారు యోగాశ్రమం పెడితే నేను వెళ్లిపోయి ఐదారు నెలలు మా అన్నయ్యకి కనిపించకుండా ధ్యానం, యోగాసనాలు చేసుకుంటూ ఉన్నా. ఇక ఇదే బెట‌ర్ అనుకొని అలానే ఉండిపోతాను అని అన్న‌య్య‌కి చెప్పాను.

కాని ఆయ‌న ఆ స‌మ‌యంలో .. భగవంతుడివై వెళ్లిపోతే ఎలా? సమాజానికి ఎందుకు ఉపయోగపడలేవ్‌.. ఇంట్లో బాధ్యతలు అనేవి ఉంటే ఇలా మాట్లాడవు’ అని అన్నారు. ఆ మాట‌లు నన్ను చాలా క‌దిలించాయి. ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌ని చూసిన త‌ర్వాతే ఈ రోజు నేను మీ ముందు ఇలా నిలుచున్నాను. రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన ‘సైరా’కి నేను గొంతు ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నా అని ప‌వ‌న్ అన్నారు .