గ్యాంగ్ లీడర్ (మళ్ళీ మొదలవుతుంది రచ్చ)టీజర్ విడుదల

సిహెచ్.రవి కిషోర్ బాబు దర్శకత్వంలో ‘బావమరదలు’ చిత్ర ఫేమ్ మోహన్ కృష్ణ , హరిణి రెడ్డి హీరో హీరోయిన్లుగా, మాణిక్యం మూవీస్, ఎస్.ఎమ్.కె ఫిలిమ్స్ పతాకాలపై సింగులూరి మోహన్ రావు నిర్మాతగా నటిస్తున్న చిత్రం “గ్యాంగ్ లీడర్” మళ్ళీ మొదలవుతుంది రచ్చ అనేది ఉప శీర్షిక. ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానుల సమక్షంలో మెగా అభిమాని అయిన మోహన్ కృష్ణ ‘గ్యాంగ్లీడర్'(మళ్ళీ మొదలవుతుంది రచ్చ) టీజర్ ను విడుదలచేశారు

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సిహెచ్.రవి కిషోర్ బాబు మాట్లాడుతూ.. ‘సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది. అన్ని అంశాలు ఇటు ప్రేక్షకులు, అటు మెగా అభిమానులు మెచ్చే విధంగా ఉంటాయి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే ప్రేక్షకులముందుకు తీసుకొస్తాం” అన్నారు.