పదేళ్ల విరామం తరువాత మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన చిత్రం `ఖైదీ నంబర్ 150`. తమిళ హిట్ చిత్రం `కత్తి` ఆధారంగా ఈ చిత్రాన్ని వి.వి.వినాయక్ తెరకెక్కించాడు. ఈ సినిమా నుంచే కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లైన్‌లోకి వచ్చింది. అసలు చిరు రీ ఎంట్రీ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌లో నిర్మించాలని అల్లు అరవింద్ ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్‌ని రామ్‌చరణ్ అడ్డుకుని సొంత బ్యానర్‌లోనే చేద్దామని పట్టుబట్టి మరీ సొంత బ్యానర్‌ని స్టాపించేలా చేశాడట.
ఇక్కడి నుంచే అల్లు – మెగా ఫ్యామిలీల మధ్య దూరం పెరగడం మొదలైందట. అయితే మరో సారి ట్రై చేద్దామని అల్లు అరవింద్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో చిరుతో ఓ భారీ ప్రాజెక్ట్‌ని ప్లాన్ చేశాడు. `సరైనోడు` ప్రీరిలీజ్ ఫంక్షన్ సాక్షిగా ఈ ప్రాజెక్ట్‌ని ప్రకటించారు కూడా. కానీ అది కూగా కార్యరూపం దాల్చలేదు. దీనికి కూడా రామ్‌చరణే కారణంగా నిలిచాడట.
బోయపాటితో సినిమా కంటే ఎన్నో ఏళ్లుగా తన తండ్రి ఎదురుచూసి చేయలేకపోయిన ఉయ్యాలవాడ కథని సినిమా చేద్దామని రామ్‌చరణ్ ప్లాన్ మార్చడంతో గీతా ఆర్ట్స్‌లో బోయపాటి – మెగాస్టార్‌ల చిత్రం మూలనపడిపోయింది. పోనీ దీని తరువాతైనా చేసే అవకాశం ఇస్తారా అంటే `ఆచార్య` చిత్రాన్ని కూడా కొరటాల సన్నిహితుడు నిరంజన్‌రెడ్డితో కలిసి రామ్‌చరణే నిర్మిస్తున్నాడు. దీంతో అల్లు వారికి మండిందని