గతాన్ని మర్చిపోయి సంతోషంగా ఉందట!?

గతాన్ని మర్చిపోయి సంతోషంగా ఉన్నానంటోంది న‌య‌న‌తార‌.  ఆమెకు గతంలో శింబు, ప్రభుదేవాతో విఫల ప్రేమ అనుభవాలున్నాయి. ఇప్పుడు ఈ కహానీలేందుకు? అనుకుంటున్నారా? సహజమే. ఎవ్వరికైనా ఇలాంటి ప్రశ్న బుర్రలో మెదులుతుంది.
 
జీవితంలో ఏమాత్రం రాజీపడని మనస్తత్వం ఉన్నవారు అపజయాల్ని పాఠాలుగా తీసుకొని భవిష్యత్తును మరింత జాగ్రత్తగా తీర్చిదిద్దుకుంటారు. తాను ఆ కోవకు చెందిన మహిళనని చెబుతోంది నయనతార. పరస్పర విశ్వాసంలేని ప్రేమలు ఎక్కువ కాలం నిలబడలేవు. స్త్రీపురుషుల బంధంలో అన్నింటికంటే ప్రధానమైంది నమ్మకం. ఆమె  విషయంలో అదే జరిగింది. నమ్మకం లేకుండా కలిసి జీవించలేనని విడిపోయానంటోంది. . ఆ సమయంలో ఆమె  తీవ్ర మనోవేదనకు గురయిందట.  
 
కెరీర్‌ మీదున్న ప్రేమే నయనతారను  ఆ కష్టాల నుంచి బయటపడేసింది. ఆ కుంగుబాటు నుంచి బయటపడటానికి సినిమాలే తోడ్పడ్డాయి. ప్రస్తుతం గతాన్ని మర్చిపోయి సంతోషంగాగడుపుతుందట. నయనతార తమిళ దర్శకుడు విఘ్నేష్‌శివన్‌ల  ప్రేమకథ తెలిసిందే!?