ఎంత మంచి సినిమా తీసినా దాన్ని కరెక్ట్‌గా మార్కెట్ చేస్తే అది జనాల్లోకి వెళుతుంది. అది జరగాలంటే దానికి తగ్గ వ్యక్తులు కావాలి. ఆ నిజాన్ని గ్రహించిన రాజమౌళి `బాహుబలి` చిత్రానికి బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌ని అసోసియేట్ చేసుకున్నాడు. `బాహుబలి ద బిగినింగ్`, బాహుబలి ది కన్‌క్లూజన్` ఈ రెండు చిత్రాలకు దేశ వ్యాప్తంగా పేరొచ్చిదంటే దానికి రాజమౌళి ప్రతిభ ఎంత వున్నాకరణ్ జోహార్ కూడా ఓ కారణంగా నిలిచారు.
అయితే ఈ దఫా కరణ్‌జోహార్‌కి రాజమౌళి హ్యాండ్ ఇచ్చినట్టు తెలిసింది. జక్కన్న తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్`. రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉగాదికి విడుదల చేసిన ఫస్ట్‌లుక్ టైటిల్ లోగో మోషన్ పోస్టర్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సినిమాపై భారీ క్రేజ్‌ని క్రియేట్ చేసింది. సినిమా పూర్తి కాకముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో హిస్టరీ క్రియేట్ చేసిన ఈ చిత్ర హిందీ అనువాద హక్కుల్ని కరణ్ జోహర్‌కి ఇవ్వలేదని తెలిసింది. రవీనా టాండన్ భర్త అనిల్ తడానీకి కట్టబెట్టినట్టు తెలిసింది.
కారణం కరణ్ జోహార్ కంటే అనిల్ తడానీ అత్యధిక మొత్తాన్ని కోట్ చేయడమే నని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అనిల్ తడానీ ఏఏ ఫిల్మ్స్ బ్యానర్‌పై బాలీవుడ్‌లో ఫక్రీ, హమ్లీ శర్మాకి దుల్హనియా, వెల్కమ్ టు కరాచీ, ఫిరంగీ వంటి చిత్రాల్ని పంపిణీ చేశాడు.