క్వారెంటైన్ టైమ్ జ‌క్క‌న్న ప్లాన్స్ ఏంటీ?

Coronavirus

క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌ట్టుగా త‌యారైంది ప్రతీ ఒక్క‌రి ప‌రిస్థితి. లాక్ డౌన్ కార‌ణంగా అంతా ఇంటికే ప‌రిమితం కావ‌డంతో ఎవ‌రెవ‌రు ఏం చే్తున్నారరో తెలుసు కోవ‌డం చాలా క‌ష్టంగా మారింది. కొంత మంది సోష‌ల్ మీడియా వేదిక‌గా విచిత్రాస‌నాలు వేస్తూ ఆ వీడియోల‌ని పోస్ట్ చేస్తున్నారు. కొంత మంది వ‌ర్కవుట్‌లు చేస్తున్నారు. కొంత మంది న‌చ్చిన వంట‌లు ప్రిపేర్ చేస్తున్నారు.

జార్జియా నుంచి వ‌చ్చిన త‌రువాత క్వారెంటైన్‌కే ప‌రిమితం అయిపోయిన ప్ర‌భాస్ త‌న స‌హ‌చ‌ర న‌టీన‌టుల‌కు వీడియో కాల్స్ చేస్తూ కాల‌క్షేం చేస్తున్నాడు. రామ్‌చ‌ర‌ణ్ ఇంట్లోనే గ‌డిపేస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా సేమ్ ఇంట్లో పిల్ల‌ల‌తో ఈ లాక్‌డౌన్ టైమ్‌ని గ‌డిపేస్తున్నాడు. మ‌రి జ‌క్క‌న్న ఏం చేస్తున్న‌ట్టు అని ఆరాతీస్తే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఒక‌టి తెలిసింది.

రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజున అల్లూరి సీతారామ‌రాజు లుక్‌కి సంబంధించిన టీజ‌ర్‌ని రిలీజ్ చేసిన జ‌క్క‌న్న మ‌రో 37 రోజుల్లో ఎన్టీఆర్ బ‌ర్త్‌డే (మే 20) రాబోతున్న నేప‌థ్యంలో కొమ‌రం భీం పాత్ర‌కు సంబంధించిన టీజ‌ర్‌ని రెడీ చేసే నిలో బిజీగా వున్నార‌ట‌. అల్లూరి పాత్ర‌ని ఎన్టీఆర్ ఇంట్ర‌డ్యూస్ చేస్తే మ‌రి కొమ‌రం భీం పాత్ర‌ని రామ్‌చ‌ర‌ణ్ ఇంట్ర‌డ్యూస్ చేస్తాడేమో చూడాల‌ని ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.