కోవ్ ఇడియట్స్‌కి పోలీస్ బెత్తం రెడీ!

దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తిస్తోంది. విదేశాల నుంచి కోరోనా వైర‌స్ ఇండియాకి ఇంపోర్ట్ చేసిన మ‌న భార‌తీయులు బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. ఎంత పెద్ద చ‌దువులు చ‌దువుకున్నా అజ్ఞానంతో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క్వారెంటైన్‌ల‌లో పెట్టినా ఇదో పెద్ద జోక్ అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తూ అందులోంచి త‌ప్పించుకుని బ‌య‌టికి వ‌చ్చేస్తున్నారు. ఇంకొంత మందేమో పారిపోయి మ‌రీ పెళ్లిళ్లూ.. ఫంక్ష‌న్‌లు చేసుకుంటూ చుట్టూ వున్న‌వారికి త‌మ వైర‌స్‌ని అంటించేస్తున్నారు.

ఇలాంటి వాళ్లే కాకుండా జ‌న‌తా క‌ర్ఫ్యూ విధించినా లెక్క చేయ‌కుండా రోడ్ల‌పైకి వ‌చ్చి య‌ధేశ్ఛ‌గా తిరిగేస్తున్నారు. దీని వ‌ల్ల ఆరోగ్యంగా వున్న వారి జీవితాలు ప్ర‌శ్నార్థం అవుతున్నాయి. దీంతో ఇక‌పై స్ట్రిక్ట్‌గా వ్య‌వ‌హ‌రించాల్సిందేన‌ని కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ణ‌యించుకున్నాయి. క‌రోనా వైర‌స్ వార్త‌లు మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి త‌నదైన స్టైల్లో ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందిస్తున్నారు రామ్‌గోపాల్‌వ‌ర్మ‌. రాములో రాముల పాట‌కి డ్యాన్స్ చేస్తూ కరోనాతో కామెడీ చేసిన ఏపీ పోలీసుల్ని సంనూర్ణేష్ బాబులా కామెడీ చేయ‌కండ‌ని చివాట్లు పెట్టిన వ‌ర్మ తాజాగా జ‌న‌తా క‌ర్ఫ్యూని పాటించ‌ని వారిపై. క్వారెంటైన్‌ల‌లో పెట్టినా త‌ప్పించుకుని బ‌య‌టికి వ‌స్తున్నవారిని కోవ్ ఇడియ‌ట్స్ అంటూ సంబోధించిన వ‌ర్మ లాక్ డౌన్‌ని అనుస‌రించ‌ని కోవ్ ఇడియట్స్‌ని కొట్టిన త‌రువాత పోలీసులు వారి ఆయుధాన్ని శుభ్ర‌ప‌రుస్తున్నారు. అని పెట్టిన ఓ వీడియో ఆస‌క్తిక‌రంగా మారింది.