కొర‌టాల శివ‌కు రౌడీ హీరో షాకింగ్ రిప్లై!

దిల్ రాజు కోసం మైత్రీని పక్కన పెట్టిన దేవరకొండ

టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న విజ‌య్ దేవ‌రకొండ స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌కు షాకింగ్‌రిప్లై ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. లాక్‌డౌన్ పొడిగించ‌డంతో టాలీవుడ్‌లో కొత్త ఛాలెంజ్ వైర‌ల్ అవుతుఏన్న విష‌యం తెలిసిందే. `బీ ద రియ‌ల్ మెన్‌` ఛాలెంజ్ పేరుతో ఇంట్లో వాళ్ల‌కు అంట్లు తోమ‌డం, బ‌ట్ట‌లు వుత‌క‌డం.. మొక్క‌లకు నీళ్లు పోయ‌డం.. ఇష్ట‌మైన వారికి వంట చేయ‌డం వంటి ఛాలెంజ్ య‌మ జోరుగా సాగుతోంది.

సందీప్ వంగ మొద‌లుపెట్టిన ఈ ఛాలెంజ్ క్ర‌మ‌క్ర‌మంగా వైర‌ల్ అవుతోంది. రాజ‌మౌళి టు తార‌క్ .. తార‌క్ టు కొర‌టాల‌కు వెళ్లిన ఈ ఛాలెంజ్ ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండని తాకింది. ఇంట్లో పాత్ర‌ల్ని క‌డిగి క్లీన్ చేసిన కొర‌టాల ఆ త‌రువాత డైనింగ్ టేబుల్‌తో పాటు ఫ్లోర్‌ని కూడా క్లీన్ చేసి త‌న టాస్క్‌ని పూర్తి చేశారు. తన‌కు సంబంధించిన వీడియోని పోస్ట్ చేస్తూ ఈ ఛాలెంజ్‌కి రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని నామినేట్ చేశాడు.

అయితే ఊహించ‌ని స్థాయిలో విజ‌య్ నుంచి రిప్లై రావ‌డం ఆక‌ట్టుకుంటోంది. `శివ సార్ మా మ‌మ్మి న‌న్ను ప‌ని చేయ‌నిట్లే. ప‌ని డ‌బుల్ అవుతుందంట‌. ఇంట్లో ఇంకా మ‌మ్మ‌ల్ని రియ‌ల్‌మెన్ చూడ‌ట్లే మ‌మ్మ‌ల్ని. పిల్ల‌ల్లానే ట్రీట్ చేస్తున్నారు. అయితే ఈ లాక్‌డౌన్ పిరియ‌డ్లోని ఓ రోజుని ఖ‌చ్చితంగా మీకు చూపిస్తాను` అని ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అదే విజ‌య్ దేవ‌ర‌కొండ స్టైల్ అని అత‌ని ఫ్యాన్స్ చెబుతున్నారు.