కొరటాల, చిరు కథ పోలి ఉందనే ఆ సినిమా రైట్స్ తీసుకున్నారా?

పవన్ కళ్యాణ్ కోసమా లేక చిరంజీవి కోసమా..క్లారిటీ ప్లీజ్

తాజాగా మలయాళ హిట్ చిత్రం లూసిఫర్‌ రీమేక్‌ రైట్స్‌ని చరణ్‌ తీసుకున్నాడనే వార్త ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మోహన్‌లాల్‌ నటించిన ఈ పొలిటికల్‌ థ్రిల్లర్‌ మలయాళంలో ఘన విజయం సాధించింది. అయితే తెలుగులోనూ ఈ సినిమాను డబ్ చేసి వదిలారు. ఇక్కడా బాగానే ఆడింది. అలాంటప్పుడు ఈ సినిమా రీమేక్ రైట్స్ తీసుకుని రామ్ చరణ్ ఏం చేస్తారు. దాంతో అసలు ఆయన రైట్స్ తీసుకున్నారా లేక ఇది కేవలం మీడియా పుట్టించిన వార్తా అనే సందేహం చాలా మందిలో కలుగుతోంది.

మరో ప్రక్క ఈ సినిమాని పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయటానికి రామ్ చరణ్ కొన్నాడని అంటున్నారు. లూసిఫర్ సినిమాని చూసిన వాళ్లంతా తెలుగులో చిరంజీవి లేదా పవన్‌కళ్యాణ్‌ రీమేక్‌ చేస్తే బాగుంటుందని అనుకున్నారనేది నిజం. ముఖ్యంగా రాజకీయాలలో వున్న పవన్‌ కళ్యాణ్ కి లూసిఫర్‌ బాగా సూట్‌ అవుతుందని కూడా చెప్పుకున్నారు.

దాంతో ఇప్పుడు చరణ్‌ సడన్‌గా ఈ చిత్రం హక్కులు తీసుకున్నాడనే టాక్ రావటంతో అందరిలోను ఆశ్చర్యం మొదలయింది. పవన్ కోసం తీసుకున్నాడని కొందరంటూంటే… అదేం లేదు… కొరటాల, చిరంజీవి సినిమాకి లూసిఫర్‌ కథని పోలిన కథని రాసుకున్నారని మరికొందరంటున్నారు. ఏదైమైనా సైరా ప్రమోషన్లతో పిచ్చ బిజీగా వున్న చరణ్‌ సడన్‌గా లూసిఫర్‌ హక్కులు తీసుకోవడం హాట్‌ టాపికే.