కాజ‌ల్ వార్త‌ల‌పై మేనేజ‌ర్ క్లారిటీ!

`సైరా న‌ర‌సింహారెడ్డి` త‌రువాత చిరంజీవి న‌టిస్తున్న `ఆచార్య‌` నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది. సినిమా ప్రారంభం నుంచి ర‌కార‌కాల కార‌ణాల వ‌ల్ల వార్త‌ల్లో నిలుస్తోంది. కొర‌టాల తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాపై వ‌చ్చిన పుకార్లు ఈ మ‌ధ్య కాలంలో ఏ సినిమాపై రాలేదు. అంతాగా ఈ సినిమా చుట్టూ వార్త‌లు షికారు చేస్తున్నాయి. కెమెరామెన్‌, క్యార‌వాన్స్‌, ఎడిట‌ర్ మార్పు.. ఇలా వ‌రుసగా ఈ సినిమా వార్త‌ల్లో నిలుస్తూనే వుంది.

ఇక ఇందులో న‌టిస్తున్న త్రిష త‌నకు సంబంధించిన పోర్ష‌న్ షూటింగ్ ప్రారంభం కాకుండానే ఈ సినిమా నుంచి త‌ప్పుకుంటున్నానంటూ షాకిచ్చింది. క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించ‌డంతో చిరు సినిమాపై ఓ రేంజ్‌లో ర‌చ్చ జ‌రిగింది. ఆ స్థానంలో కాజ‌ల్‌ని హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. త‌మిళ‌, మిందీ సినిమాలు క‌లిపి కాజ‌ల్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. డేట్స్ స‌మ‌స్య కార‌ణంగా కాజ‌ల్ ఈ చిత్రానికి షాకివ్వ‌బోతోందంటూ పుకార్లు మొద‌ల‌య్యాయి.

ఈ వార్త‌ల‌పై తాజాగా కాజ‌ల్ మేనేజ‌ర్ స్పందించిన‌ట్టు తెలిసింది. ఈ ప్రాజెక్ట్ నుంచి కాజ‌ల్ త‌ప్పుకోవ‌డం లేద‌ని, ఆమె విష‌యంలో జ‌రుగుతున్న‌ది అంతా పుకారేన‌ని తేల్చిపారేశాడు. కాజ‌ల్ `ఆచార్య‌` టీమ్‌‌తో ట‌చ్‌లో వుంద‌ని, ఆ సినిమా చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశాడు. దీంతో కాజ‌ల్ `ఆచార్య‌` నుంచి త‌ప్పుకుంటోంద‌న్న‌ది ఓ రూమ‌రే అని తేలిపోయింది. కాజ‌ల్ అగ‌ర్వాల్ `ఆచార్య‌`కు ముందు మంచు విష్ణు న‌టిస్తున్న మోస‌గాళ్లు, ముంబై సాగా, హే సినామిక‌, ఇండియ‌న్ 2 చిత్రాల్ని అంగీక‌రించింది.