ఏ ఏండకు ఆ గొడుగు పట్టడం.. ఎటు గాలి వీస్తే అటు వైపుకు మల్లడం కొంత మందికి అలవాటు.. ఈ విషయంలో కమెడియన్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ పొలిటీషయన్ బండ్ల గణేష్‌ని మంచిన వాళ్లు వుండరేమో. తెలంగాణ ఎన్నికల వేళ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అండ చూసుకుని గులాబీ దళపతి, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేసి ఆ తరువాత కాంగ్రెస్ దారుణంగా పరాజయం చెందడంతో నాలుక కరుచుకున్న బండ్ల ఆ తరువాత నుంచి మీడియా కంటపడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
గత రెండు మూడు నాలుగు నెలల నుంచి సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా వుంటున్న బండ్ల తాజాగా కొత్త పల్లవి అందుతున్నాడు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ కేసీఆర్ జపం అందుకున్నాడు. మా క్షేమం కోసం సమాజం కోసం మా పిల్ల కోసం మా భవిష్యత్తు కోసం మీరు తీసుకునే నిర్ణయాల్లో సరిలేరు నీకెవ్వరు గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నాలుగు రోజులు కాదు సార్ నమ్మకంతో మీరున్నారన్న భరోసాతో 40 రోజులు అయినా ఓపికతో ఇళ్లకే పరిమితం అవుతోంది విజయం సాధిస్తాం జై కేసీఆర్` అంటూ కొత్తగా గులాబీ దళపతిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడు. మరీ కరోనా నెపంతో తెరాసకు చేరువ కావాలని బండ్ల చేస్తున్న ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.