టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ కోసం పెద్ద రిస్క్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. ఆయన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ షెడ్యూల్ థాయిలాండ్ లో ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రాన్ని దర్శకుడు సల్మాన్ తెరకెక్కిస్తున్నారు.
ఈ వైల్డ్ డాగ్ చిత్రంలో నాగార్జున ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఎన్ ఐ ఏ అధికారి పాత్ర చేస్తున్నారు ఇప్పటికే ఈ చిత్రం హైదరాబాద్ మరియు ముంబైలో కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా తదుపరి షెడ్యూల్ కోసం థాయిలాండ్ వెళ్లనున్నారట. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నఇలాంటి తరుణంలో విదేశాలలో షూటింగ్ అంటే పెద్ద రిస్క్ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు.
గతంలో చైనాలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేసిన చిత్ర బృందం కోవిడ్ కారణంగా విరమించుకున్నారు. కథ రీత్యా విదేశాలలో ఈ మూవీ షూటింగ్ తప్పనిసరి అని తెలుస్తుంది