ఎన్నాళ్ల కెన్నాళ్ల‌కు దేవీకి బంప‌ర్ ఆఫ‌ర్!

టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ‌ప్ర‌సాద్‌. త‌న‌దైన సంగీతంతో హుషారెత్తించే సంగీతం దేవీ సొంతం. తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా క్రేజ్‌ని సొంతం చేసుకున్న దేవి గ‌త కొంత కాలంగా తెలుగులో త‌న ప‌ట్టుని కోల్పోతున్నాడు. త‌మ‌న్ ఆ స్థానాన్ని ద‌క్కించుకుంటున్నాడు. ఇదిలా వుంటే దేవీ పాట‌ల‌కు బాలీవుడ్‌లో మంచి ఫాలోవ‌ర్స్ వున్నారు.

`ఆ అంటే అమ‌లా పురం..` నుంచి `ఆర్య 2` కోసం చేసిన `రింగ రింగా…` పాట‌లు బాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్స్ అయ్యాయి. తాజాగా దేవీకి ఈ పాట‌లే బాలీవుడ్ ఆఫ‌ర్‌ని తెచ్చిపెట్టాయి. స‌ల్మాన్‌ఖాన్ న‌టిస్తున్న తాజా చిత్రం `రాధే`. ప్ర‌భుదేవా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంగీతం అందించే ఛాన్స్ దేవిశ్రీ‌ప్రసాద్‌ని వెతుక్కుంటూ వ‌చ్చింది. ఈ ప్ర‌పోజ‌ల్‌ని ప్ర‌భుదేవా తీసుకొచ్చాడ‌ట‌. చెప్పిన వెంట‌నే సల్మాన్‌ఖాన్ ఓకే చెప్పేశాడ‌ట‌. 2011లో స‌ల్మాన్ హీరోగా రీమేక్ అయిన‌ `రెడీ` చిత్రం కోసం `ధింక చిక‌…` అనే పాట‌కు మ్యూజిక్ కంపోజ్ చేశాడు. మ‌ళ్ళీ ఇన్నేళ్ల‌కి పూర్తి స్థాయిలో అన్ని పాట‌ల‌కు సంగీతం అందించే అవ‌కాశం `రాధే` చిత్రంతో ద‌క్కింది.