ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం గిఫ్ట్ రెడీ అవుతోంది!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం గిఫ్ట్ రెడీ అవుతోంది!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి లాక్ డౌన్ త‌రువాత మాట‌ల మాంత్రికుడు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ రెడీ చేస్తున్నాడ‌ని తెలిసింది. `అర‌వింద స‌మేత‌` త‌రువాత ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో ఓ భారీ చిత్రం తెర‌పైకి రాబోతున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ 30వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, నంద‌మూరి తార‌క రామారావు ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై ఎస్‌. రాధాకృష్ణ , నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ సంయుక్తంగా నిర్మించనున్నారు.

రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్‌` త‌రువాత ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ నేప‌థ్యంలో లాక్ డౌన్ ముగిసిన త‌రువాత ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఈ సినిమా నుంచి ఓ స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌ని రెడీ చేస్తున్నారట‌. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని జ‌క్క‌న్న స్పెల్ టీజ‌ర్‌ని రెడీ చేస్తుంటే త్రివిక్ర‌మ్ మాత్రం ఎన్టీఆర్ 30వ సినిమా టైటిల్‌ని రివీల్ చేయ‌బోతున్నాడ‌ట‌. ఇది తెలిసిన నంద‌మూరి ఫ్యాన్స్ సంబ‌రాలకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలిసింది.

`అర‌వింద స‌మేత‌` చిత్రాన్ని ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కించిన త్రివిక్ర‌మ్ తాజా చిత్రాన్ని మాత్రం స‌మ‌కాలీన రాజ‌కీయాల నేప‌థ్యంలో తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలిసింది. త‌మ‌న్ సంగీతం అందించ‌నున్న ఈ చిత్రానికి సంబంధించి న‌టీన‌టు, సాంకేతిక నిపుణుల ఎంపిక ర‌గాల్సి వుంది. ‌