ఇదేం యోగాస‌నం బాబోయ్‌!

క‌రోనా పుణ్య‌మా అని దేశ వ్యాప్తంగా చిత్రాలు.. విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. వాయు కాలుశ్యం త‌గ్గింది.. ప్రైవేట్‌ ఆసుప‌త్రుల‌న్నీ మూత‌బడ్డాయి. జ‌లంధ‌ర్ నుంచి రెండు వంద‌ల కిలోమీట‌ర్ల దూరంలో వున్న హిమాల‌యాలు స్వ‌చ్ఛంగా క‌నిపిస్తున్నాయి. ఇవ‌న్నీ ఓకే కానీ సినిమా వాళ్ల చిత్రాలు మాత్రం తారా స్థాయికి చేరాయి.

ముఖ్యంగా హీరోయిన్‌ల వేశాలు చిత్ర విచిత్రంగా మారాయి. లాక్ డౌన్ విధించ‌డంతో ఇంటికే ప‌రిమిత‌మైన హీరోయిన్‌లు రోజుకో వీడియోని సొష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం దాన్ని వైర‌ల్ చేయ‌డం నిత్య కృత్యంగా మారింది. ఇక హాట్ హీరోయిన్‌ల వేశాల గురించి.. వాళ్ల చిన్నెల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలేమో.

ఆ కోవ‌లోకి వ‌చ్చే బాలీవుడ్ హాట్ గ‌ళ్ ఇషా గుప్తా .. అవ‌స‌రానికి మించి ఎక్స్‌పోజింగ్ చేయ‌డం.. ఆ ఫొటోల‌ని, లేదా వీడియోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం ఇషాకి అల‌వాటు.. లాక్ డౌన్ స‌మ‌యంలో కూడా సోష‌ల్ మీడియాని హీటెక్కించేస్తోంది. తాజాగా ఇషా ఇన్‌స్టాలో షేర్ చేసిన యోగాస‌నాల‌కు సంబంధించి ఫొటోలు చూసిన నెటిజ‌న్స్ ఇదేం యోగా బాబోయ్ అంటూ నోరెళ్ల‌బెడుతున్నారు.