ఫొటోస్టోరీ: చ‌ర‌ణ్ బ్యూటీ వ‌ల‌పు వ‌ల‌లు!

సినిమాల్లో అవ‌కాశాలు రాలేదా?… మీ గ్లామ‌ర్‌ని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదా?.. సోష‌ల్ మీడియా వేదికగా రెచ్చిపోవ‌డ‌మే.. హాట్ హాట్‌.. బోల్డ్ ఫొటోల‌తో రెచ్చిపోవాల్సిందే.. ఇదే సూత్రాన్ని ప్ర‌జెంట్ హీరోయిన్స్ ఫాలో అవుతున్నారు. హాట్ హాట్ ఫొటోల‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దాంతో మేక‌ర్స్ వ‌రుస అవ‌కాశాలిచ్చి ఎంక‌రేజ్ చేస్తున్నారు. ఇదే ఫార్ములాను మెగా హీరో రామ్‌చ‌ర‌ణ్ హీరోయిన్ ఇషా గుప్తా బాగానే వంట‌బ‌ట్టించుకున్న‌ట్టుంది.

బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాది వారికి హాట్ హాట్ ఫొటోల‌తో వ‌ల‌పు వ‌ల‌లు వేస్తోంది. అర్థ న‌గ్న ఫొటోషూట్‌ల‌తో ర‌చ్చ చేసిన ఇషా గుప్తాకు ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ఒక్క సినిమా కూడా లేదు. దీంతో సోష‌ల్ మీడియా ఇన్‌స్టాలో హాట్ ఫోటోల‌తో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు గాలం వేస్తోంది. రామ్‌చ‌ర‌ణ్ న‌టిచిన డిజాస్ట‌ర్ `విన‌య విధేయ రామ‌`తో తెలుగులో ఎంట్రీ ఇచ్చినా ఇషాకు ఎలాంటి మైలేజీని అందించ‌లేక‌పోయింది. మ‌రి ఈ హాట్ ఫొటో షూట్‌లైనా ఇషా గుప్తాకు అవ‌కాశాలు తెచ్చిపెడుతుందో చూడాలి అంటున్నారు బాలీవుడ్ జ‌నాలు.