ఇంత‌కీ `ఆర్ ఆర్ ఆర్‌` ఫ‌స్ట్‌లుక్ ఎప్పుడు?

రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్‌` నుంచి రోజుకో ల‌ప్‌డేట్ బ‌య‌టికి వ‌చ్చేస్తున్నా ఫ‌స్ట్‌లుక్, టీజ‌ర్‌కు సంబంధించిన వార్త మాత్రం బ‌య‌టికి రావ‌డం లేదు. షూటింగ్ మాత్రం య‌మ స్పీడుగా జ‌రిగిపోతోంది. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, అజ‌య్‌దేవ్‌గ‌న్‌ల‌పై ఇటీవ‌లే కీల‌క ఘ‌ట్టాల్ని రాజ‌మౌళి చాలా కూల్‌గా పూర్తి చేసేశాడు. త‌మ ప్రాంత ప్ర‌జ‌ల ఫ్రీడ‌మ్ కోసం ప్రాణాల‌ని సైతం లెక్క‌చేయ‌కుండా వీరోచిత పోరాటం చేసిన ఇద్ద‌రు యోధుల ఫిక్ష‌న్ క‌థ‌గా ఈ చిత్రాన్ని రాజ‌మౌళి అత్య‌ద్భుతంగా తెర‌పైకి తీసుకొస్తున్నారు.

అంతా బాగానే వుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని ఈ సంక్రాంతికి రిలీజ్ చేసి స‌ర్‌ప్రైజ్ ఇస్తార‌ని ప్రేక్ష‌కులు ఆశ‌గా ఎదురుచూశారు కానీ నిరాశే ఎదురైంది. పండ‌గ శుభాకాంక్ష‌లు త‌ప్ప టీమ్ నుంచి చిన్ని లుక్ కూడా బ‌య‌టికి రాలేదు. తాజాగా ఈ విష‌య‌మై ఆర్ ఆర్ ఆర్ టీమ్‌ని `బాహుబ‌లి` ట్విట్ట‌ర్ హ్యాండిల్ పేజ్ నిల‌దీయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. మాహిష్మ‌తి పౌరులంతా `ఆర్ ఆర్ ఆర్‌` ఫ‌స్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ మీరు మాత్రం పండ‌గ‌ల‌కి శుభాకాంక్ష‌లు చెప్ప‌డం త‌ప్ప ఫ్యాన్స్‌ని అస‌లు ప‌ట్టించుకొవ‌డం లేదు. డియ‌ర్ కెప్టెన్ రాజ‌మౌళి ఈ విష‌యంలో అప్ డేట్ ఇవ్వండి ప్లీజ్‌` అని పోస్ట్ చేశారు.

దీనికి `ఆర్ ఆర్ ఆర్` ట్విట్టర్ హ్యండిల్ నుంచి `మీ అడుగుజాడ‌ల్లోనే మేమూ న‌డుస్తున్నాం. `బాహుబ‌లి` ఫ‌స్ట్‌లుక్‌, ట్రైల‌ర్ కోసం అభిమానుల్ని మీరు ఎంత‌గా ఎదురుచూసేలా చేశారో మేము ఇంకా మ‌ర్చిపోలేదు. మేము మా అభిమానుల్ని ప్రేమిస్తాం. వారూ మ‌మ్మ‌ల్ని ప్రేమిస్తున్నారు. వాళ్ల‌కి తెలుసు వారి అంచ‌నాల్ని మేము రీచ్ అవుతామ‌ని. కాబ‌ట్టి `ఆర్ ఆర్ ఆర్` ఫ‌స్ట్ లుక్ కోసం ఎదురుచూస్తూ వుండండి త్వ‌ర‌లోనే వ‌స్తున్నాం`అని ఆర్ ఆర్ ఆర్ టీమ్ పెట్టిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ఇంత సంభాష‌ణ జ‌రిగినా ఫ‌స్ట్‌లుక్‌పై జ‌క్క‌న్న చిన్న హింట్ కూడా ఇవ్వ‌క‌పోవ‌డం ఫ్యాన్స్‌కి చిరాకు పుట్టిస్తోంది.