టాలీవుడ్ హీరోల్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ శైలి ప్రత్యేకం. సినిమాల్లోనూ.. రియల్ లైఫ్‌లోనూ ఒకే తరహాలో మాట్లాడటం. ఒక విధింగా వ్యవహరించడం విజయ్ దేవరకొండలోని ప్రత్యేకత. దాని వల్లే అందరికి భిన్నంగా కనిపించాడు. అందరికంటే భిన్నమైన హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఏది అడిగినా మిగతా హీరోలతో పోలిస్తే ఓపెన్‌గా మాట్లాడే విజయ్ దేవరకొండ తాజాగా తన పెళ్లి, పెళ్లి చేసుకునే అమ్మాయి విషయంలో పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు.
కరోనా సాయం పేరుతో ది దేవరకొండ ఫౌండేషన్ పేరుతో నిధులు సేకరిస్తూ మధ్య తరగతి ఫ్యామిలీస్‌కి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే 6 వేల కుటుంబాలకు నిత్యావసరాలని అందించి అభినందనలు పొందుతున్న విజయ్ దేవరకొండ తాజాగా ఓ జాతీయ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా తనకు ఎలాంటి అమ్మాయి కావాలో, తనలో ఎలాంటి క్వాలిటీస్ వుండాలో చెప్పేశాడు.
విజయ్‌కి నచ్చాలంటే తనలో సెన్సాఫ్ హ్యూమర్ వుండాలట. అంతకు మించి స్పందించే హృదయం వుండాలని చెప్పాడు. మరి అలాంటి అమ్మాయిని కలిశారా? అంటే కలిశానని చెప్పిన విజయ్ తనకు గాళ్ ఫ్రెండ్ వుందన్న విషయాన్ని వెల్లడించకుండా తెలివిగా తప్పించుకున్నాడు. మరి పెళ్లెప్పుడని ప్రశ్నిస్తే ఇంట్లో వాళ్లు సెటిల్ అయ్యాక వివాహం చేసుకోమంటున్నారని, ఆయితే తనకు ఇంకా ఆ మెచ్యూరిటీ రాలేదని చెప్పి షాకిచ్చాడు. ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.