ఆ బాలీవుడ్ రీమేక్ కాపీ కాద‌న్న బ‌న్ని!

బ‌న్ని న‌టించిన అల వైకుంఠ‌పుర‌ములో సినిమాకి ఫ‌లానా బాలీవుడ్ సినిమా స్ఫూర్తి అని లేదూ ఫ‌లానా టాలీవుడ్ క్లాసిక్ స్ఫూర్తి అని ప్ర‌చార‌మైంది. ముఖ్యంగా బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ సోను కి టిటులీకి స్వీటీ స్ఫూర్తితో `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రం తీస్తున్నార‌ని ప్ర‌చార‌మైంది. అయితే ఇది నిజ‌మా? అని బ‌న్నీనే ప్ర‌శ్నిస్తే ఆస‌క్తిక‌ర విష‌యాల్ని చెప్పారు.

వాస్త‌వానికి రూమ‌ర్ గా ప్ర‌చార‌మైనా `సోను కీ టిటు కీ స్వీటీ`ని రీమేక్ గురించి త్రివిక్ర‌మ్ నేను చ‌ర్చించుకున్నాం. కానీ దాని కంటే త్రివిక్ర‌మ్ వినిపించిన వేరే స్క్రిప్టులోనే బోలెడంత వినోదం ఉంద‌నిపించింది. అందుకే ఆ రీమేక్ ఆలోచ‌న ప‌క్క‌న పెట్టేశాం అని తెలిపాడు బ‌న్ని. అలాగే అల‌.. స్క్రిప్టును త్రివిక్ర‌మ్ తో చ‌ర్చించిన‌ప్పుడు అన్ని అంశాల మేలు క‌ల‌యిక ఉన్న స్క్రిప్టు ఇద‌ని భావించాన‌ని బ‌న్ని తెలిపాడు.

నేడు ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓవ‌ర్సీస్ లో వ‌న్ మిలియ‌న్ డాల‌ర్ వ‌సూళ్ల వైపు దూసుకెళుతోంది. తెలుగు రాష్ట్రాల వ‌సూళ్ల వివ‌రాలు తెలియాల్సి ఉందింకా.