ఆ క‌లెక్ష‌న్స్ ఫేక్ అని చెప్పేశాడు!

మా సినిమా తొలి రోజే వంద కోట్లు దాటేసింది. రెండు రోజుల్లో ఆ ఫీగ‌ర్‌ని కూడా దాట‌బోతోంది. ఇదీ గ‌త కొన్నేళ్లుగా తెలుగు సినిమా క‌లెక్ష‌న్‌ల గోల‌. అయితే ఈ గోల మాకు అవ‌స‌రం లేద‌ని ద‌ర్శ‌కుడు వేగేశ్న స‌తీష్ అంటున్నారు. ప్రేక్షకులు ఇచ్చే క‌లెక్ష‌న్స్ చాల‌ని కొత్త‌గా వాటిని పెంచి చూపించుకోవాల్సిన అవ‌స‌రం త‌మ‌కి లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. వేగేశ్న స‌తీష్ రూపొందించిన తాజా చిత్రం `ఎంత మంచి వాడ‌వురా!`. నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ హీరోగా న‌టించిన ఈ చిత్రం ఈ సంక్రాంతి రోజు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

డివైడ్ టాక్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రం 50 కోట్లు క‌లెక్ట్ చేసింద‌ని ఓ ప్ర‌చారం చేస్తున్నార‌ట‌. అది ఫేక్ అని , త‌మ సినిమా అంత క‌లెక్ట్ చేయ‌లేద‌ని, అదంతా ఎవ‌రో చేస్తున్న ప్ర‌చార‌మ‌ని కొట్టిపారేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇటీవ‌ల విడుద‌లైన స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాల మేక‌ర్స్ త‌మ సినిమాలు ఇంత క‌లెక్ట్ చేశాయంటే ఇంత క‌లెక్ట్ చేశాయ‌ని, ప్రారంభ వ‌సూళ్ల విష‌యంలో రికార్డులు సృష్టించాయ‌ని వ‌రుస పోస్ట‌ర్ల‌ని రిలీజ్ చేస్తుంటే వేగేశ్న స‌తీష్ మాత్రం అమ సినిమా విష‌యంలో జ‌రుగుతున్న ప్ర‌చారంలో నిజం లేద‌ని, అవి ఫేక్ క‌లెక్ష‌న్‌ల‌ని వెల్ల‌డించ‌డం విశేషంగా చెప్పుకుంటున్నారు.