అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఓటీటీ `ఆహా`. భారీ రేంజ్‌లో ప్లాన్‌లు వేసి ఈ ఓటీటీని తెరపైకి తీసుకొచ్చారు. లాంచింగ్ కి ఏడాది నుంచే ప్లాన్‌లు గీసినా అది ప్రాక్టికల్‌గా మాత్రం అస్సలు వర్కవుట్ కాలేదు. నందిని రెడ్డితో పాటు చాలా మందిని హైర్ చేసుకున్నా ఫలితం మాత్రం శూన్యం. లోకల్ కంటెంట్‌ని నమ్ముకుని నెటిజన్స్‌ని ఆకట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అల్లు అరవింద్‌కు మాత్రం గట్టి షాకులే తగిలాయి.
ఓటీటీ అంటే అడల్ట్ కంటెంట్, అడ్వెంచరస్ స్టోరీస్.. మొత్తంగా కంటెంట్ కొత్తగా వుండాలే.. కంటికి ఇంపుగా వుండాలే. అప్పుడే జనం విరగబడి చూస్తారు. సబ్స్‌క్రైబర్స్ పెరుగుతారు. ఈ లాజిక్ మరిచిన అల్లు అరవింద్ లోకల్ కంటెంట్ అని అంతా పాత సినిమాలతో `ఆహా`ని నింపేశారు. ఇదే పెద్ద డ్రాబ్యాక్‌గా మారింది. దాన్ని మార్చి ఆహాని ఆహా అనిపించాలంటే ఓ ట్రబుల్ షూటర్ కావాలి. అదే ఆలోచనకు వచ్చిన అల్లు అరవింద్ ఇందుకు దర్శకుడు క్రిష్ అయితే బాగుంటుందని అతన్ని సీన్‌లోకి తీసుకొస్తున్నట్టు తెలిసింది.
ఇటీవలే క్రిష్‌కి `ఆహా` క్రియేటీవ్ బాధ్యతల్ని అప్పగించారని తెలిసింది. యూత్ మాత్రమే ఇప్పుడు ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు అత్యధికంగా చూస్తున్నారు. ఫోన్‌లల్లోనే అధికంగా చూస్తుండటంతో వాళ్లనే టార్గెట్ చేస్తూ క్రిష్ ఆహా కోసం కొతకత తరహా వెబ్ సిరీస్‌లని అందించబోతున్నాడట. బాంబే వర్గాలతో అత్యధికంగా కాంటాక్ట్స్ వుండటం వల్ల వాళ్లని మించి ఎలాంటి కంటెంట్‌ని అందిస్తే `ఆహా`ని టాప్ ప్లేస్‌లో నిలబెట్టొచ్చో క్రిష్‌కి బాగా తెలుసు. అదే అతనికి `ఆహా`ని అప్పగించేలా చేసింది. అల్లు అరవింద్ ఊహించినట్టే క్రిష్ ఆహాని టాప్ ప్లేస్‌కి తీసుకొస్తాడో లేదో తెలియాలంటే ఓ నెల రోజు వరకు వేచి చూడాల్సిందే.