`బాహుబలి` సిరీస్ తరువాత రాజమౌళి చేస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. ఎన్టీఆర్, రామ్‌చరణ్ తొలిసారి కలిసి నటిస్తున్న సినిమా కావడం, బాహుబలి తరువాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడం ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా ఆసక్తినెలకొంది. ఆ క్రేజ్‌కి తగ్గట్టే భారీ హంగులతో ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. బాలీవుడ్ కు చెందిన బిగ్ స్టార్స్ అజయ్‌దేవ్‌గన్, అలియాభట్, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ సన్. ఒలివియా, అలిసన్ డూడీలు నటిస్తుండటంతో సినిమా క్రేజ్ హద్దులు దాటింది.
ఇదిలా వుంటే ఈ చిత్రానికి మరిన్ని అదనపు మెరుగుల్ని అద్దే పనిలో పడ్డారు రాజమౌళి. క్రేజీ కాంబినేషన్‌లో హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, మహేష్‌ని కూడా లైన్‌లోకి దింపేస్తున్నాడు. వారితో `ఆర్ ఆర్ ఆర్`కు స్పెషల్ ఎఫెక్ట్‌ని తీసుకురాబోతున్నారట. ఇద్దు యోధుల ఫిక్షన్‌గా రాబోతున్న ఈ సినిమాకు వారి పరిచయ సన్నివేశాలని తెలుగులో మహేష్‌తో, హిందీలో అమితాబ్ బచ్చన్‌తో వాయిస్ ఓవర్ ఇప్పించబోతున్నారట.
మిగతా భాషల్లోనూ అక్కడి టాప్ స్టార్స్‌తో మంతనాలు జరుపుతున్నారట. తమిళంలో సూర్య చెబుతారా లేక రజనీకాంత్‌ని రంగంలోకి దింపుతారా అన్నది చూడాలి. మళయాళంలో మాత్రం మోహన్‌లాల్‌ని అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా ప్రతీ భాషకు సంబంధించిన స్టార్ హీరోలతో వాయిస్ ఓవర్ చెప్పిస్తే సినిమాకు వచ్చే ఫ్రీ పబ్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే జక్కన్న భారీ స్కెచ్ వేశాడని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.