`ఆర్ ఆర్ ఆర్‌` డిజిట‌ల్ రైట్స్ రికార్డ్‌!

మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు, ఆదివాసీ పోరాట యోధుడు కొమ‌రంభీం వీరిద్ద‌రు ఎక్క‌డ క‌లిశారు?. ఎలా క‌లిశారు? ఎందుకు క‌లిశారు? క‌ఒంత కాలం పాటు అజ్ఞాత జీవితాన్ని ఎందుకు గ‌డిపారు. చ‌దువురాని కొమ‌రంభీం ఎలా ఇంగ్లీష్ నేర్చుకున్నాడు? స‌్వాతంత్య్ర పోరాటంలో వీరిద్ద‌రు ఏ స్థాయిలో పోరాటం చేశారు? అనే ఆస‌క్తికర విష‌యాల‌ని ఓ ఫిక్ష‌న‌ల్ క‌థ‌గా రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్నారు.

ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ఆస‌క్తిరేకెత్తుతోంది. దాదాపు 450 కోట్ల భారీ వ్య‌యంతో భార‌తీయ తెర‌పై ఇంత వ‌ర‌కు రాని స‌రికొత్త క‌థ‌ని రాజ‌మౌళి తెర‌పైకి తీసుకొస్తుండ‌టంతో ఈ సినిమా కోసం యావ‌త్ దేశం మొత్తం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఇప్ప‌టికే సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్ ప‌కంగా ఇండియ‌న్ సినిమాల్లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన‌ట్టు తెలుస్తోంది. క్లైమాక్స్ కోస‌మే దాదాపు 150 కోట్లు ఖ‌ర్చు చేస్తున్న ఈ చిత్ర డిజిట‌ల్ రైట్స్‌ని స్టార్ ఇండియా గ్రూప్ సంస్థ అత్య‌ధిక మొత్తాన్ని అంటే 250 కోట్లు చెల్లించిన‌ట్లు తెలిసింది.

ప‌ది భార‌తీయ భాష‌ల‌కు క‌లిసి ఈ మొత్తం చెల్లించిన‌ట్టు చెబుతున్నారు. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే ఒక సినిమా డిజిట‌ల్ రైట్స్ ఇంత భారీ బొత్తానికి అమ్ముడు పోవ‌డం ఇదే ప్ర‌ధ‌మం కావ‌డంతో ఈ విష‌యంలో `ఆర్ ఆర్ ఆర్‌` రికార్డుల కెక్క‌బోతోంది.