`ఆర్ ఆర్ ఆర్‌`లో మ‌రో హీరోయిన్‌?

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న విజువ‌ల్ వండ‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`. ఈ సినిమా ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచి రోజుకో వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కొమ‌రంభీం పాత్ర‌లో, అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న ఈ చిత్ర అప్‌డేట్స్ కోసం యావ‌త్ దేశం మొత్తం ఎదురుచూస్తోంది. తొలిసారి ఇద్దు టాప్ స్టార్‌లు క‌లిసి న‌టిస్తున్న సినిమా కావ‌డం. 1920 బ్రిటీష్ ఇండియా కాలం నేప్యంలో సాగే క‌థ కావ‌డం, విప్ల‌వ వీరులు అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీం పాత్ర‌ల‌ని వెండితెర‌పై చూపించ‌బోతుండ‌టంతో ఈ సినిమాపై అంచ‌నాలు ఆకాశాన్ని చేరాయి.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మ‌రో అప్‌డేట్ బ‌య‌టికి వ‌చ్చింది. ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా అలియాభ‌ట్‌, ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్ న‌టి ఒలివియా మోరీస్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. అయితే వీరితో పాటు మ‌రో క‌థానాయిక కూడా న‌టిస్తోంద‌ని తెలిసింది. ఆ హీరోయిన్ శ్రియ అని వినిపిస్తోంది. ఇందులో బాలీవుడ్ హీరో అజ‌య్‌దేవ్‌గ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. అత‌నికి జోడీగా శ్రియ‌ని తీసుకున్నార‌ని, ఈ విష‌యాన్ని ఎక్క‌డా బ‌య‌టికి పొక్క‌నివ్వ‌డం లేద‌ని తెలిసింది.