ఇటీవల జరిగిన ఓ ఇష్యూలో రాజమౌళిని లాగాలని వర్మ ప్రయత్నించిన విషయం తెలిసిందే. దానికి కౌంటర్‌గా `నన్ను ఇన్‌వాల్వ్ చేయకండి మాస్టారు` అంటూ రాజమౌళి సైడైపోయారు. తాజాగా వర్మని జక్కన సోషల్ మీడియా వేదికగా ఆడుకోవడం ఆసక్తికరంగా మారింది. ఒక సంవత్సరం తన ఆయుస్సు తగ్గింది అని చెప్పుకోవడానికే ఇష్టపడని ఆర్జీవీ ఏకంగా పుట్టినరోజుల్నే నిషేధించారు. ప్రతి ఒక్కరూ హ్యాపీ బర్త్ డేలకు అలవాటు పడిన ఈ ట్రెండ్ లోనూ తాను వాటన్నిటికీ దూరం అని చెబుతారు. ఇక ప్రతిసారీ తన బర్త్ డేకి ఎవరైనా విషెస్ చెప్పి వయసును గుర్తు చేయొద్దని ప్రాధేయపడుతుంటారు. అలా వయసును గుర్తు చేసుకోవడం తనకు ఇష్టం ఉండదని నిర్మొహమాటంగా చెబుతుంటారు ఆర్జీవీ. అలాంటిది ఇప్పుడు “ఆర్జీవీ తాతా“ అని పిలిచేవారొకరు వస్తే ఆయన అంగీకరిస్తారా? ప్చ్.. అంగీకరించాల్సిన టైమ్ వచ్చింది.
ఆరు పదుల వయసులోనూ ఇంకా నవయువకుడిలా చెలామని అయిపోతున్న ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వర్మను ఇక తాతా అని పిలిచి ఏడిపించే చిన్నారి ఒకరు ఈ భూమిపై ఉద్భవించారు. రామ్ గోపాల్ వర్మ కుమార్తె.. డాక్టర్ రేవతి ఆడ శిశువుకు జన్మనిచ్చారు. అమెరికా నుంచి ఆ మేరకు శుభవార్త అందింది. తాతకు చెక్ పెట్టే చిన్నారి ఇక ఉద్భవించినట్టే! అంటూ ఆర్జీవీ అభిమానులు సంతోషించే వేళ ఇది. ఇక ఆర్జీవీ తనని తాను ఫ్యామిలీ మ్యాన్ కాదు అని చెప్పుకున్నా ఇటీవల ఆయనా మారుతున్నారు. 2013లో కుమార్తె రేవతి వివాహానికి ఆయన ఎటెండయ్యారు. ఇక తన తల్లిగారు అయితే ఆర్జీవీ ఏం చేసినా దానినే సమర్థిస్తారు. పుత్రోత్సాహమ్ము.. ఆ సుపుత్రుని కనంగా! అన్న సంతోషం ఆవిడలో కనిపిస్తుంటుంది. ఏదేమైనా ఎట్టకేలకు ఆర్జీవీ తాతయ్యాడు. అదే అందరికీ సంతోషకర విషయం. ప్రతిసారీ ఇలాంటి సందర్భాల్ని ఎంతో ఫన్నీగా అభిమానులతో షేర్ చేసుకునే ఆర్జీవీ ఈసారి ఎలాంటి ట్వీట్ విసురుతారో చూడాలి.
ప్రస్తుతం దిషా ఘటనపై ఆర్జీవీ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ ఘటన పూర్వాపరాల్ని తనదైన కోణంలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అందుకోసం బాధిత కుటుంబాలను ఆర్జీవీ కలుస్తున్నారు. స్క్రిప్టు రెడీ అవుతోంది.
Congratulations Ramu thaatayya garu…😂😂😂💕🤣❤️❤️
Wishing your granddaughter will be the person who will finally rein you in… btw what do you prefer
Ramu tata
Ramu Nanna or
Grandpa Ramu…@RGVzoomin 😂😂🤣— rajamouli ss (@ssrajamouli) February 10, 2020