రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ `ఆర్ ఆర్ ఆర్`. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటిస్తున్నారు. డీవీవీ దానయ్య అంత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఉగాది, రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ లోగో టీజర్, రామ్‌చరణ్ పరిచయ వీడియో సినిమాపై అంచనాల్ని పెంచేసింది.
దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రాన్ని అనుకున్న టైమ్‌లో పూర్తి చేసి జనవరి 8న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే కరోనా ఈ షెడ్యూల్‌ని డిస్ట్రబ్ చేసేసింది. దీంతో 20 రోజులు ఆలస్యం అనుకున్న ఈ చిత్ర షూటింగ్ షెడ్యూల్ లాక్ డౌన్ మే 1 దాకా పొడిగించడంతో మరో పదహేను రోజుల ఆల్యం.. అంటే మొత్తం నెల రోజులకు మించి అన్నమాట దీంతో షూటింగ్ షెడ్యూల్ లో రాజమౌళి మార్పులు చేయడం మొదలుపెట్టాడట.
దీనికి తోడు అలియా భట్ డేట్స్‌కు సంబంధించిన వెర్షన్ షూటింగ్ కూడా ఆలస్యమౌతూ వస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాజమౌళి కొత్త ప్లాన్ వేస్తున్నాడట. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రాన్ని జనవరి నుంచి ఏప్రిల్‌కు పోస్ట్‌పోన్ చేసే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. రాజమౌళి కూడా అదే ప్లాన్ కు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.