ఆమెని వ‌ద‌ల‌మంటున్న `ఆర్ ఆర్ ఆర్` టీమ్‌!

రాజ‌మౌళి ప్ర‌తిష్ణాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టిస్తున్నారు. హాలీవుడ్ ఫిల్మ్ `మోట‌ర్ సైకిల్ డైరీస్‌` ప్రేర‌ణ‌తో ఈ చిత్ర క‌థ‌ని రాజ‌మౌళి సిద్ధం చేసుకుని వెండితెర‌పై ఓ అద్భుతంగా తీర్చిదిద్ద‌బోతున్నారు. ఇందులో ఎన్టీఆర్ ఆదివాసీ యోధుడు కొమ‌రంభీంగా, రామ్‌చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపించ‌బోతున్నారు.

ఇప్ప‌టికే 70 శాతానికి మించి చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. కీలక ఘ‌ట్టాల షూట్‌ని కూడా ముగించారు. హీరోయిన్‌లుగా అలియాభ‌ట్‌, ఒలివియా మోరీస్ న‌టిస్తున్నారు. తాజాగా బిజీ షెడ్యూల్ కార‌ణంగా ఈ సినిమా నుంచి అలియాభ‌ట్ త‌ప్పుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని, అలియాభ‌ట్ ఈ సినిమా ఖ‌చ్చితంగా చేస్తార‌ని అందులో ఎలాంటి అనుమానం లేద‌ని టీమ్ స్ట్రాంగ్‌గా చెబుతున్నార‌ట‌.

అలియాభ‌ట్ ఇందులో సీత పాత్ర‌లో అల్లూరి సీతారామ‌రాజు భార్య‌గా క‌నిపించ‌నుంది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా షూటింగ్ ఆపేశారు. ఏప్రిల్‌లో మ‌ళ్లీ మొద‌లుపెడ‌తార‌ట‌. ఏప్రిల్ లేదా మే నుంచి అలియా షూటింగ్‌లో పాల్గొంటుంద‌ని చిత్ర వ‌ర్గాల స‌మాచారం.