అనుపమకు కోపమొచ్చింది!

క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి కోసం కేంద్రం చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఎక్క‌డి జ‌నం అక్క‌డే వుండాల‌ని, ఎవ‌రూ ఇళ్ల‌ల్లోంచి బ‌య‌టికి రావ‌ద్ద‌ని, లాక్ డౌన్‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో బ‌య‌టికి వ‌చ్చే వారు ఎవ్వ‌రైనా మాస్కులు ధ‌రించాల్సిందే అంటూ డాక్ల‌ర్లు, ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నెత్తినోరు మోత్తుకుని చెబుతోంది. అయినా స‌రే మ‌న వాళ్ల‌లో చ‌ల‌నం క‌నిపించ‌డం లేదు. ఏ ఒక్క‌రిలోనూ క‌రోనా భ‌యం క‌నిపించ‌డం లేదు.

ర‌క్ష‌ణ కోసం వాడాల్సిన మాస్కుల్ని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ప‌డేస్తున్నారు. వాడిన వాటిని జాగ్ర‌త్త‌గా డ‌స్ట్ బిన్‌ల‌లో వేయాల‌న్న క‌నీస స్ప్రొహ వుండ‌టం లేదు. ఇదే హీరోయిన్ అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌కు ఆగ్ర‌హాన్ని తెప్పిస్తోంది. మాస్కుల్ని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ విచ్చ‌ల‌విడిగా ప‌డేస్తున్నార‌ని, ఇదేనా బాధ్య‌త అంటే.. క‌రోనాపై పోరాడాల్సిన తీరు ఇదేనా? అంటూ చిందులేస్తోంది. మ‌న వాళ్ల‌ల్లో అవేర్ నెస్‌, భ‌యం పెర‌గ‌న‌ప్పుడు ఏం చేసినా.. ఏం మాట్లాడినా ఫ‌లితం వుండ‌దు.