గత కొద్ది రోజులుగా బాలకృష్ణ నటించే 105వ చిత్రం ఎవరి దర్శకత్వంలో చేస్తారనేదానిపై గత కొంత కాలంగా చర్చ నడుస్తోంది. కేఎస్ రవికుమార్ సినిమా ఓకే అయినా, ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. అయితే మరో ప్రక్క బాలయ్య, కెఎస్ రవికుమార్ చిత్రం లాంచ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.
దాంతో అభిమానుల్లో ఓ డైలమో పరిస్దితి ఏర్పడింది. క్లారిటీ మిస్సైంది. కెఎస్ రవికుమార్ సినిమా ఉంటుందా ఉండదా..ఉండకపోతే ఏ డైరక్టర్ బాలయ్యను డైరక్ట్ చేస్తారనేది తేలలేదు. కానీ బాలయ్య అందరి లెక్కలు సరిచూసేలా ఈ రోజు తన కొత్త చిత్రం లాంచింగ్ పోగ్రామ్ పెట్టేసుకున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం షూటింగ్ ప్రారంభకావడంతో అభిమానుల్లో నెలకొన్న సంగ్ధిదతకు తెరపడింది.
కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ 105వ చిత్రంలో నటించబోతున్నారు. గురువారం ఈ చిత్ర షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్త సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కోదండరామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.
సీకే ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సి.కల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం సమకూరుస్తున్నారు. జులై నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. హీరోయిన్, ఇతర పాత్రల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.