అందుకు మోహ‌న్‌లాల్ ఒప్పుకుంటారా?

అందుకు మోహ‌న్‌లాల్ ఒప్పుకుంటారా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ కలిసి మ‌ళ్లీ న‌టించ‌బోతున్నారా? . బాబాయ్ అబ్బాయ్‌గా క‌నిపించి మ‌ళ్లీ మాస్ ఆడియ‌న్స్‌కు క‌నువిందు చేయ‌బోతున్నారా? అంటే టాలీవుడ్ వ‌ర్గాలు నిజ‌మే అంటున్నాయి. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా న‌టించిన చిత్రం `జన‌తా గ్యారేజ్‌`. కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో మ‌లయ‌ళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ కీల‌క పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే.

ఎన్టీఆర్‌, మోహ‌న్‌లాల్ మ‌ధ్య ఈ చిత్రంలో మంచి కెమిస్ట్రీ కుద‌ర‌డంతో ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన స‌న్నివేశాల‌కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్ అప్లాజ్ వ‌చ్చింది. దీన్ని గ‌మ‌నించిన రాజ‌మౌళి మ‌రోసారిఈ ఇద్ద‌రిని క‌ల‌ప‌బోతున్నాడ‌ట‌. జ‌క్క‌న్న తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌లిసి న‌టిస్తున్నారు. ఒక‌రు మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా, మ‌రొక‌రు ఆదివాసీ పోరాట యోధుడు కొమ‌రం భీంగా క‌నిపించ‌బోతున్నారు.

అయితే ఇందులో కొమ‌రం భీంని తీర్చి దిద్ది స్ఫూర్తిగా నిలిచిన బాబాయ్ పాత్ర ఒక‌టి వుంద‌ట‌. భీం జీవితంలో ప్ర‌ధాన పాత్ర పోషించిన ఆ పాత్రకు మోహ‌న్‌లాల్ అయితే బాగుంటుంద‌ని భావించిన రాజ‌మౌళి ఇటీవ‌లే ఆయ‌న‌ను సంప్ర‌దించార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం రెమ్యున‌రేష‌న్‌కు సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. జ‌క్క‌న్న కండీష‌న్స్‌కి మ‌రి మోహ‌న్‌లాల్ ఒప్పుకుంటారా? అన్న‌దే ఇక్క‌డ అస‌లు ట్విస్ట్ … ఇవ‌న్నీ ఓ కొలిక్కి వ‌స్తే అధికారికంగా ప్ర‌క‌ట‌న చేస్తార‌ట‌. ఇప్ప‌టికే ఈ చిత్రంలోని ఓ కీల‌క పాత్ర‌లో బాలీవుడ్ హీరో అజ‌య్‌దేవ్‌గ‌న్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.