హేభాప‌టేల్‌తో ల‌వ్ ఎఫైర్ లేద‌ట‌!

రాజ్ త‌రుణ్

హాట్ పాప హేభా ప‌టేల్‌, యంగ్ హీరో రాజ్ త‌రుణ్ గ‌త కొన్నేళ్లుగా రిలేష‌న్ షిప్‌లో వుంటున్నార‌ని, పెళ్లి కూడా చేసుకోవాల‌నుకుంటున్నార‌ని గ‌త కొన్నేళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై రాజ్ త‌రుణ్ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా వ‌రుస క‌థ‌నాలు మ‌ళ్లీ మళ్లీ వ‌స్తూనే వున్నాయి. తాజాగా రాజ్ త‌రుణ్ న‌టిస్తున్న చిత్రం `ఒరేయ్ బుజ్జిగా`. ఇందులో హేభా ప‌టేల్ కూడా న‌టిస్తోంది. దీంతో మ‌ళ్లీ ఇద్ద‌రి మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌ని పుకార్లు మొద‌ల‌య్యాయి.

దీనిపై తాజాగా రాజ్ త‌రుణ్ మ‌రోసారి వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. త‌ను ఎవ‌రితో రిలేష‌న్‌షిప్‌లో లేన‌ని స్ప‌ష్టం చేశాడు. గ‌త కొంత కాలంగా త‌న వ్య‌క్తిగ‌త‌, వృత్తిప‌ర‌మైన జీవితంపై పుకార్లు వినిపిస్తున్నాయని, అయితే అందులో ఎలాంటి వాస్త‌వం లేద‌ని వెల్ల‌డించాడు. మ‌రో మూడేళ్ల‌లో తాను వివాహం చేసుకోబోతున్నాన‌ని క్లారిటీ ఇచ్చాడు. `ఓ రేయ్ బుజ్జిగా` ప్ర‌చారంలో భాగంగా టూర్లో వున్న రాజ్‌త‌రుణ్ త‌న‌ని ప్ర‌శ్నించిన మీడియాకు త‌న పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు.