భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాల ద్వారా హిట్ కొట్టిన లావణ్య త్రిపాఠికి ఆ తర్వాత చెప్పుకోదగ్గ హిట్స్ రాలేదు. చైతుతో చేసిన యుద్ధం శరణం చిత్రం , సాయిధరమ్ తేజ సరసన చేసిన ఇంటిలిజెంట్ సినిమాలు ఆమెకు భారీ ఎత్తున నిరాశను మిగిల్చాయి. సక్సెస్ నే టాలెంట్ గా పరిగణించే ఈ ఇండస్ట్రీ ఆమెను మెల్లిమెల్లిగా ప్రక్కన పెట్టడం మొదలెట్టింది. అప్పటికీ రెమ్యునేషన్ తగ్గించుకుని రామ్ తో ‘ఉన్నది ఒకటే జిందగీ’ చేసింది. ఆ సినిమా వర్కవుట్ కాలేదు. చేతిలో సినిమాలు తగ్గిపోవటం మొదలైంది.
దాంతో మళ్లీ ఎలాగైనా మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చి హిట్ కొట్టాలని లావణ్య త్రిపాఠి ప్రయత్నాలు మొదలెట్టింది. ఇప్పుడు ఆమె వరుణ్ తేజ సరసన అంతరిక్షం సినిమా చేస్తోంది. ఆ సినిమానే ఆమెను నిలబెట్టాలి. ఈ లోగా తను ఖాళీగా ఉండటం ఎందుకు అనుకుందో ఏమో ..మాంచి హాట్ ఫొటో ఒకటి దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇప్పుడు మీరు ఇక్కడ చూసే ఫొటో అదే. ఈ ఫొటో చూస్తే ఆమె …తను గ్లామర్ రోల్స్ కు కూడా సై అంటూ సిగ్నల్స్ పంపుతున్నట్లు లేదూ..మరి ఇండస్ట్రీ జనం…ఇప్పటికైనా ఆమె తపనని అర్దం చేసుకుంటే మేలు.