‘సైరా’ పై నారా లోకేష్ షాకింగ్ కామెంట్

నారా లోకేష్ కు తెగ నచ్చేసిందిట..

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా రూపొందిన చిత్రం సైరా. ఈ సినిమా మొన్న బుధవారం విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. అటు సాధారణ ఆడియన్స్ నుండి ఇటు ఫిలిం విశ్లేషకుల వరకు సైరా చిత్రం పై, చిరు నటనపై , దర్శకుడు సురేంధర్ రెడ్డి మేకింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటికే ఇండస్ట్రీ నుంచి సినీ ప్రముఖులంతా ‘సైరా’ అద్భుతమైన సినిమా.. హృదయాన్ని కరిగించిన సినిమా.. గొప్ప దేశభక్తిని చాటిన సినిమా అని ఓ రేంజిలో పొగుడుతున్నారు. కాగా తాజాగా సైరా పై నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు.

లోకేష్ ట్వీట్ చేస్తూ “తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన సినిమా ‘సైరా’. ఇది చిరంజీవిగారి 12 ఏళ్ళ కల. ఆయన తన కలను ఎంతో అద్భుతంగా ఆవిష్కరించుకున్నారు. తెలుగువీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్య్ర పోరాటాన్ని తెరపై చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచింది. హ్యాట్సాఫ్! చిరంజీవిగారు. అంటూ నారా లోకేష్‌ ట్వీట్ చేశారు. చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి విజయాన్ని అందుకున్న నిర్మాత రామ్‌చరణ్, దర్శకులు సురేంద్ర, చిత్ర యూనిట్‌కి నారా లోకేష్ అభినందనలు తెలిపారు.ఈ కామెంట్ ని చూసి సోషల్ మీడియా జనం…ఏమిటీ విచిత్రం అనుకుంటున్నారు.

<

p style=”text-align: justify”>చిరు కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌ రెడ్డి తెరకెక్కించారు. కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో రామ్‌ చరణ్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. అక్టోబరు 2న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. ప్రస్తుతం ‘సైరా’ సక్సెస్ ను మెగా ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తోంది.