వరుస హిట్లు అందుకున్న హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘వాల్మీకి’ అంటూ మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకుడు కాగా 14 ప్లస్ రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 20 న విడుదల అవుతుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అసలైతే ఈ సినిమా ఒక వారం ముందే విడుదల కావాలి కానీ, నాని సినిమా గ్యాంగ్ లీడర్ కూడా అదే రోజు వస్తుండడంతో విడుదల తేదీని వాయిదా వేశారు.
ఈ సినిమాలో వరుణ్ తేజ్ పక్క రౌడీ లుక్ లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. అధర్వ మురళి ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా పూజ హెగ్డే నటించింది. ఆమె కూడా ఒక పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. మరి ఈ వాల్మీకి కథలేంటో తెర పై చూడాల్సిందే.