Home Tollywood 'సాహో' తేడా టాక్ పై డైరెక్టర్ సుజిత్ వివరణ

‘సాహో’ తేడా టాక్ పై డైరెక్టర్ సుజిత్ వివరణ

సాహో ఫ్లాప్ టాక్ గురించి డైరక్టర్ ఏమన్నాడంటే…

భారీ అంచనాల మధ్య మొన్న శుక్రవారం రిలీజైన సాహో డివైడ్ టాక్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేఫధ్యంలో సాహో విడుదలైన మొదటి రోజు నుండే ప్రభాస్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ డైరెక్టర్ సుజీత్ నే టార్గెట్ చేశారు. ప్రభాస్ లాంటి స్టార్ ని అప్పగించినా సినిమా ని పాడు చేసాడన్నారు. అలాగే మూవీకి వచ్చిన టాక్ కి పూర్తి బాధ్యుడిగా సుజీత్ ని చేయడం జరిగింది. అంత పెద్ద సినిమా బాధ్యత అప్పగిస్తే నాశనం చేశాడంటూ మండిపడ్డారు. అయితే సుజీత్ ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండిపోయాడు. ఎప్పుడైతే నార్త్ లో ఈ సినిమా కలెక్షన్స్ బాగున్నాయని టాక్ వచ్చిందో అప్పుడు తనపై వస్తున్న కామెంట్స్ పై, సినిమా టాక్ పై స్పందించాడు.

తన మొదటి షార్ట్ ఫిల్మ్ 17 ఏళ్ల వయసులో తీశానని చెబుతూ.. విమర్శ ఎప్పుడు తనకు బూస్ట్ ఇచ్చిందనే చెప్పాడు. సినిమా చాలా మందికి నచ్చిందని అయితే ఎవరైతే అంచనాలకు మించి చేరలేదని అనుకుంటున్నారో వారు మరోసారి సినిమా చూస్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తారని పేర్కొన్నాడు.

సాహో చిత్రంలోని గొప్ప స్క్రీన్ ప్లే, అలాగే మేము పడ్డ కష్టం తెలియాలంటే మీరు మరొక్క మారు థియేటర్లకు వెళ్లి చూడాలని మనవి చేశాడు. భారీ అంచనాలతో సినిమా చూడడం వలనే సాహో చిత్రం నచ్చడం లేదని అభిప్రాయపడ్డాడు.

అలాగే ఇన్నేళ్ల కెరీర్ లో ఏనాడు వెనక్కి తగ్గలేదని సాహో సినిమాలో మీరు మిస్ అయినా విషయాలు అర్ధం కావాలంటే మరోసారి చూడండని సుజిత్ ఇన్స్టాగ్రామ్ లో వివరణ ఇచ్చాడు. దీంతో ప్రభాస్ అభిమానులు అతనికి మద్దతుగా నిలుస్తూ సినిమా బాగుందని ప్రశంసిస్తున్నారు.

- Advertisement -

Related Posts

‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ .. సెట్స్ లో అడుగుపెట్టిన పవన్ !

టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణాదగ్గుబాటి ల కాంబినేషన్ లో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్...

ఏమయ్యా విజయ్.. ఇవి మిడిల్ క్లాస్ వాళ్ళు కొనేలా ఉన్నాయా?

తెలుగు రాష్ట్రాలలో విజయ్ దేవరకొండకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాగే లైగర్ సినిమాతో తన క్రేజ్ ను పక్క రాష్ట్రాల్లో కూడా పెంచుకోవాలని...

ఖిలాడి ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది !

ఈ ఏడాది సంక్రాంతికి క్రాక్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న మాస్‌ మహారాజ రవితేజ, రాక్షసుడుతో బ్లాక్‌బస్టర్‌ సాధించిన దర్శకుడు రమేశ్‌ వర్మ పెన్మత్స కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'ఖిలాఢి'. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌...

మేం ఎప్పుడూ అలాగే ఉంటాం.. కౌశల్‌పై గీతా మాధురి కామెంట్స్

బిగ్ బాస్ ఇంట్లో జరిగిన విషయాలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. అక్కడ జరిగినవి అక్కడే మరిచిపోయాం.. అందరం ఇప్పుడు ఒకటే అనే కథలు ఎన్ని చెప్పినా కూడా ఎవ్వరూ వినరు. ఎందుకంటే జనాలు...

Latest News