‘సాహో’ 12 రోజులు కలెక్షన్స్ (ఏరియావైజ్)
బాహుబలి చిత్రం తర్వాత అదే స్దాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ‘సాహో’ . ఈ సినిమా మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు ప్రేక్షకుల నుండి మొదటి రోజు నుంచి డివైడ్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాకి దక్కిన ప్రీ రిలీజ్ హైప్, బాహుబలి ఎఫెక్ట్ తో ఈ సినిమాకి భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరిగాయి.
అందుకే సినిమా టాక్ ఎలా ఉన్నా సినిమా కలెక్షన్స్‌కు మాత్రం పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. కానీ ఐదో రోజున మాత్రం పూర్తిగా కలెక్షన్స్ భారీ డ్రాప్ ప్రారంభమైంది. యాభై నుంచి అరవై శాతం డ్రాప్ మొదలైంది. శెలవలు పూర్తవటంతో ఆ ఎఫెక్ట్ కనిపించిందని తేల్చారు. అయితే డ్రాప్ ఉంటుందని ఊహించారు కానీ ఈ స్దాయి అని ఎవరూ ఎక్సపెక్ట్ చేయలేకపోయారు. ఈ నేపధ్యంలో 12 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
ఏరియా షేర్ (కోట్లలో )
——————– —————————————-
నైజాం 27.72
సీడెడ్ 11.49
నెల్లూరు 4.13
కృష్ణా 5.03
గుంటూరు 7.92
వైజాగ్ 9.23
ఈస్ట్ గోదావరి 7.07
వెస్ట్ గోదావరి 5.53
మొత్తం ఆంధ్రా & తెలంగాణా 78.92
తెలుగులో ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చినా కూడా బాలీవుడ్‌లో మాత్రం మంచి ఆదరణ దక్కింది. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ కలెక్షన్స్ కూడా పుంజుకున్నాయి. దాంతో సాహో కలెక్షన్స్ లెక్కలు బాగానే నమోదయ్యాయి. అయినా సరే సాహో నష్టాలు తప్పించుకోవడం కష్టమే అంటున్నారు.