శ్రియ‌ బాగానే డిమాండ్ చేస్తుందిగా

అరవైలు దాటిన హీరోలను చాలా మందిని చూశారంతా. కానీ హీరోయిన్ల విషయానికి వస్తే ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేళ్లు అవగానే ఇంక చాలు వెళ్ళిపో మాకు ఛాన్స్ ఇవ్వు అంటూ కొత్త హీరోయిన్లు గెంటేస్తారు. అంతేకాకుండా అప్పటికి మన హీరోయిన్లు సైజులు మారిపోయి, కళ్లకింద రింకిల్స్ వచ్చేసి వెగటు కొట్టేస్తారు ప్రేక్షకులకి. కానీ శ్రియ‌ విషయానికి వస్తే అంతా రివర్స్. ఇప్పటికీ గ్లామర్ పాత్రలకు సెట్ అవుతుంది అన్నట్టుగా మెయింటెయిన్ చేస్తుంది. అంతేకాదు పారితోషికం కూడా ఏమాత్రం తగ్గించుకోవట్లేదట.

తాజాగా తను నటిస్తున్న సినిమాకి అరకోటి వరకు డిమాండ్ చేసిందని టాక్. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తాను అని శ్రియ‌ శరన్ ముందుగానే ప్రకటించింది. చెప్పినట్టుగానే చేస్తుంది ఈ నటి. సినిమాటోగ్రాఫర్ సుజన దర్శకత్వంలో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా రానుంది. ఈ సినిమాలో శ్రియ‌ ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఆ పాత్రకి యాభై లక్షలు డిమాండ్ చేసిందట. అది ఇంపార్టెంట్ రోల్ కావడంతో అడిగినంత పారితోషికాన్ని ఇచ్చేశారట నిర్మాతలు. పెళ్లయ్యాక కూడా శ్రియ‌ డిమాండ్ తగ్గలేదు అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జామ్పుల్.