వివాహానంతరం సినీ పరిశ్రమకి దూరమైనా నటి జ్యోతిక, ఈ మధ్యనే తన రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా జ్యోతిక నటిస్తున్న చిత్రం “రాక్షసి”. ఈ చిత్రం లో జ్యోతిక ప్రభుత్వ ఉపాధ్యాయురాలి పాత్రలో కనిపిస్తారు.
తన సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో మాట్లాడుతూ జ్యోతిక ప్రస్తుత రాజకీయా వ్యవస్థ పై నిప్పులు చెరిగారు. “దేశం లో 35% విద్యార్థులు మాతృభాషలోనే చదువుతున్నారు. ఈ పేద విద్యార్థులు అధిక ఫీజులు కట్టి ప్రైవేట్ లో కోచింగ్ తీసుకోలేరు. ఉపాధ్యాయులే సరిగ్గా రాని ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఏ విధంగా నీట్ వంటి పెద్ద పరీక్షలో రాణించగలరో కేంద్రం చెప్పాలి. ఎంతో మంది పేద విద్యార్థులు నష్టపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు ఇకనైనా విద్యార్థుల గురించి పట్టించుకోవాలి”, అని జ్యోతిక కోరారు.
నీట్ పరీక్షా విధానం ద్వారా ప్రతిష్టాత్మక వైద్య విద్య కోర్సులలో ప్రవేశాలు జరగాలని కేంద్ర ప్రభుత్వం 2013 లో నిర్ణయించింది. కాగా, పలు రాష్ట్రాల నుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదురుకొని ఎట్టకేలకు 2015 నుండి నీట్ పరీక్షా విధానం తప్పనిసరిగా కేంద్రం ప్రకటించింది. నీట్ పరీక్షా ప్రాంతీయ భాషలో పెట్టనందున, మాతృభాషలో చదువుతున్న విద్యార్థులు మొదట్లో ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం, ప్రశ్నాపత్రం ప్రాంతీయ భాషలో ఉన్నపటికీ…ప్రభుత్వ పాఠాశాలలో చదివిన తమకు నీట్ వంటి పరీక్షను ఎదురుకొనేందుకు శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయులు లేరని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వ కళాశాలలు ఎదురుకుంటున్న ఇటువంటి సమస్యలను ఆధారంగా చేస్కునే ‘రాక్షసి’ సినిమా రూపుదిద్దుకుంది అని చిత్ర బృందం తెలియజేసారు.