అల్లు అర్జున్ త్వరలో సుకుమార్ చిత్రాన్ని మొదలుపెడుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్‌పై అత్యంత భారీగా రూపొందుతున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ ఈ నెల 15 నుంచి కేరళ అడవుల్లో ప్రారంభం కాబోతోంది. పేరుకు కేరళ అడవులైనా సినిమాలో మాత్రం నల్లమల అడువులుగా చూపిస్తారట. అక్కడ లొకేషన్స్ బాగుండటంతో సుకుమార్ కేరళ అడవుల్లో కీలక సన్నివేశాల్ని ప్లాన్ చేసినట్టు తెలిసింది.
అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్‌గా తమిళ నటుడు విజయ్ సేతుపతి కనిపించబోతున్నారు. ఆయన గెటప్, మేనరిజమ్స్ డిఫరెంట్‌గా వుంటాయట. ఆహార్యం, ప్రవర్తన భీకరంగా వుంటుందని తెలుస్తోంది. ఇందులో విజయ్‌సేతుపతి ఫారెస్ట్ రేంజర్‌గా కనిపిస్తారట. ఈ చిత్రం కోసం విజయ్ సేతుపతి 10 కోట్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. క్యారెక్టర్‌కున్న ప్రాముఖ్యత దృష్ట్యా మేకర్స్ ఆయన అడిగినంతా ఇస్తున్నట్టు ఇటీవలే ఓ వార్త బయటికి వచ్చింది. పక్కా రియలిస్టిక్ అప్రోచ్‌తో ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు.