లావణ్య త్రిపాఠి ఉత్సాహానికి కారణం ఇదేనా?!

 

లావణ్య త్రిపాఠి ఉత్సాహానికి కారణం ఇదేనా?!

అందం, అభినయంతో ఆకట్టుకున్న కథానాయిక లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి నుంచి అర్జున్ సురవరం వరకూ మంచి పాత్రలతో మెప్పించిన లావణ్య.. ఇప్పుడు సెకెండ్ ఫేజ్ మొదలెట్టిన ఉత్సాహంతో కనిపిస్తోంది. ప్రస్తుతం సందీప్ కిషన్‌తో ఏ1 ఎక్స్‌ప్రెస్, కార్తికేయతో చావు కబురు చల్లగా చిత్రాలు చేస్తోన్న లావణ్య.. పాత్రల్లో పరిణితి చూపించేందుకు ప్రత్యేక కసరత్తులు మొదలెట్టింది. అందులో ప్రధానంగా ఏ1 ఎక్స్‌ప్రెస్ చిత్రం కోసం -మైదానంలోకి దిగి హాకీ బ్యాట్ ఝుళిపిస్తోందట.హాకీ నేపథ్యంగా తెరకెక్కుతోన్న కథ కావడం, లావణ్య పోషిస్తోన్న పాత్ర క్రీడాకారిణి కావడంతో పాత్రలో పర్ఫెక్షన్ కోసం హాకీ కోర్టులో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది. తెలుగు, తమిళ ప్రాజెక్టులతో షూటింగ్ బిజీ ఉన్నప్పటికీ, హాకీ ప్రాక్టీస్‌కు డుమ్మా కొట్టడం లేదట. ఏ1 ఎక్స్‌ప్రెస్ తాజా షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. అయితే పాత్రను పండించేందుకు లావణ్య డెడికేషన్ చూసి చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోందట.

ఇక అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పతాకంపై కార్తికేయ హీరోగా రూపొందుతోన్న ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో లావణ్య లీడ్‌రోల్ చేస్తోంది. గీతా ఆర్ట్స్‌తో ఇది ఆమెకు మూడో సినిమా. డార్క్ కామెడీతో తెరకెక్కుతోన్న చిత్రంలో -కెరీర్‌లో ఇప్పటి వరకూ చేయనటువంటి క్యారెక్టర్ చేస్తున్నట్టు లావణ్య చెబుతోంది.